ఈ అమ్మాయి నేటి సెన్సేషనల్ హీరోయిన్.. గుర్తు పట్టారా?
on Mar 1, 2021
ఎప్పుడు ఎవరికి ఎలా స్టార్డమ్ వస్తుందో తెలీదు. ఒకే ఒక్క సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోతుంటారు కొంతమంది. అలాంటి కొద్దిమందిలో లేటెస్ట్ సెన్సేషనల్ కృతి శెట్టి ఒకరు. 'ఉప్పెన' సినిమాతో ఆమెకు వచ్చిన కీర్తి ప్రతిష్ఠలు ఇటీవలి కాలంలో ఎవరికీ రాలేదని చెప్పవచ్చు. ఆ సినిమా క్లైమాక్స్‌లో తండ్రి పాత్రధారి, సౌత్ ఇండియాలోని బెస్ట్ యాక్టర్స్‌లో ఒకడైన విజయ్ సేతుపతిని నిలబెట్టి డైలాగ్స్ చెబుతూ, కళ్లతోనే పర్ఫార్మెన్స్ ఇస్తూ ఆమె చెలరేగిన తీరు ఓ కొత్త తార విషయంలో అత్యంత అరుదనే చెప్పాలి.
సినిమాల్లోకి రాకముందు చిన్నప్పట్నుంచే మోడల్‌గా రాణించిన ఘనత కృతి సొంతం. ముఖ్యంగా లైఫ్‌బాయ్, డైరీ మిల్క్ చాక్లెట్ యాడ్స్‌లో కృతి మెరిసింది. పై ఫొటో లైఫ్‌బాయ్ యాడ్‌కు సంబంధించిందే. ఆ యాడ్‌లో బాక్సింగ్ ప్రాక్టీస్ చేశాక, లైఫ్‌బాయ్ సోప్‌తో స్నానం చేస్తుంది కృతి. 'ఉప్పెన' ఉధృతి పుణ్యమా అని, ఆ యాడ్‌కు ఇప్పుడు మంచి గిరాకీ ఏర్పడింది.
అంటే కెమెరా కృతికి కొత్త కాదన్న మాట. అందుకే 'ఉప్పెన'లో అలా అదరగొట్టింది. ఇన్‌ఫ్యాక్ట్ హీరో వైష్ణవ్ తేజ్‌కు మించి క్రేజ్ తెచ్చుకుంది. అందుకే హీరోలు ఆమెను తమ సరసన నాయికగా కోరుకుంటున్నారు. దాంతో ఆమె డేట్స్ కోసం నిర్మాతలు క్యూలు కడుతున్నారు. ప్రస్తుతం నానితో 'శ్యామ్ సింగ రాయ్', సుధీర్‌బాబుతో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాలు చేస్తున్న ఆమె మరో అరడజను సినిమాలకు సంతకం చేసినట్లు వినికిడి.