English | Telugu

'సాహో'ను ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు కానీ...

on Aug 30, 2019

 

టాలీవుడ్‌లో 'బాహుబలి'కి లేని సైతం అంచనాలతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ సినిమా 'సాహో'కు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఫైట్లు హాలీవుడ్ టాప్ యాక్షన్ సినిమాలకు ఏమాత్రం తక్కువగా లేవని ప్రశంసిస్తున్న వాళ్లు కథ, కథనం ఆశించిన మేర లేవని పెదవి విరుస్తున్నారు. ఫస్టాఫ్‌లో తొలి గంట ఆసక్తికరంగా లేదనీ, ప్రభాస్ ఎంట్రీ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని ఊహిస్తే అందుకు భిన్నంగా చప్పగా ఉందనీ అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రభాస్ కనిపించిన తీరు, అతను చేసిన ఫైట్లను మాత్రం ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అతని కేరెక్టరైజేషన్ విషయంలో మరింత శ్రద్ధ చూపించాల్సి ఉందని ఫీలవుతున్నారు. ఇంటర్వల్ బ్యాంగ్, చివర్లో ప్రభాస్ కేరెక్టర్‌లో వచ్చే ట్విస్ట్‌ను వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. డైలాగ్స్‌లో మెరుపులు లేకపోవడం, చాలా సందర్భాల్లో అమెచ్యూరిష్‌గా ఉండటం సినిమాకు మైనస్‌గా మారిందంటున్నారు. 
సినిమాలో చాలా కేరెక్టర్లున్నా ప్రభాస్, శ్రద్ధా కపూర్, చుంకీ పాండే, నీల్ నితిన్ ముఖేశ్ కేరక్టర్లు మినహాయిస్తే మిగతా పాత్రల్ని బాగా డిజైన్ చెయ్యలేదని ఎక్కువమంది చెబుతున్న మాట. వెన్నెల కిశోర్ ఉన్నప్పటికీ సినిమాలో వినోదం పాలు బాగా తక్కువ కావడం మరో మైనస్ అని చెబుతున్నారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగున్నప్పటికీ పాటల్లో 'ఏ చోట నువ్వున్నా', 'బ్యాడ్ బాయ్' సాంగ్స్ మాత్రమే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి.
'రన్ రాజా రన్'ను స్క్రీన్‌ప్లేతో ఆసక్తి కరంగా నడిపించి ఆకట్టుకున్న డైరెక్టర్ సుజిత్.. 'సాహో' సినిమాకి ఆ విషయంలో ఫెయిలయ్యడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారీ బడ్జెట్, ప్రభాస్ లాంటి ఆల్ ఇండియా స్టార్ చేతిలో ఉన్నప్పటికీ, తనకు వచ్చిన గొప్ప అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ స్క్రీన్‌పై కనిపించిన ప్రతిసారీ పూనకం వచ్చినవాళ్లలా ఊగిపోతూ కనిపించారు. అతను చేసిన ఫైట్లను విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. 


Cinema Galleries



Latest News


Video-Gossips