మిహీకా పెళ్లి లెహంగా తయారీకి 10 వేల గంటల సమయం పట్టింది!
on Aug 10, 2020
"మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్" అంటారు. రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ వివాహమూ అలా నిర్ణయింపబడిందేమో. ఈ ఏడాది మేలో తనను ఆరాధించే అనేకమంది అమ్మాయిల హృదయాల్ని బద్దలుచేస్తూ మిహీకా బజాజ్ తన ఫియాన్సీ అని పరిచయం చేశాడు రానా. అప్పట్నుంచీ ఆ ఇద్దరూ ప్రేమలో ఎంతగా మునిగి తేలుతున్నారో తెలుసుకుని సంతోషపడ్డాం. ఆ ప్రేమపక్షుల పెళ్లి పనులు పసుసు-కుంకుమ వేడుకతో మొదలై, చివరకు మే 8న ఆత్మీయ అతిథుల మధ్య కన్నుల పండుగగా జరిగిన పెళ్లి వేడుకలో ఆ ఇద్దరూ ఏడడుగులు నడవడంతో ముగిశాయి.
పెళ్లిలో పేరుపొందిన ఫ్యాషన్ డిజైనర్ అనామికా ఖన్నా డిజైన్ చేసిన లెహంగాలో మెరుపు సుందరిలా మెరిసింది మిహీకా. గోల్డ్ మెటల్వర్క్తో చేతిపనితో ఆ లెహంగా తయారు చేయడానికి ఏకంగా 10 వేల గంటల సమయం పట్టిందని చెప్పుకుంటున్నారు. దాన్ని బట్టి దాని ఖరీదెంతో ఊహించుకోవాల్సిందే. మరోవైపు రానా సంప్రదాయ షేర్వాణీలో పెళ్లికొడుకు పాత్రలో ఒదిగిపోయాడు.
రానా, మిహీకా దంపతులుగా మారిన క్షణం నుంచి వారి సోషల్ మీడియా ప్రొఫైల్స్ శుభాభినందనల సందేశాలతో పోటెత్తాయి. ఒక ఫ్రెండ్ మెసేజ్‌ను రిపోస్ట్ చేస్తూ, మిహీకా ఒక పిక్చర్‌ను షేర్ చేసింది. అది పెళ్లి ముందు రోజు తీసుకున్న ఫొటో. అందులో పర్పుల్ లెహంగాలో మిహీకా గార్జియస్‌గా కనిపిస్తుండగా, రానా కుర్తా-జీన్స్‌లో డాపర్ లుక్‌లో అదరగొడుతున్నాడు. నవ్వులు చిందిస్తూ పిక్చర్-పర్ఫెక్ట్ మూమెంట్ అన్నట్లు కెమెరాకు పోజిచ్చారు రానా, మిహీకా.