English | Telugu

విధి వికటిస్తే ఇంత దారుణంగా ఉంటుందా?

on Aug 5, 2017

బ్యాడ్ టైమ్ మొదలైతే... ఆ ప్రభావం ఎంత బలంగా ఉంటుందో కేరళ నటుడు దిలీప్ పరిస్థితి చూస్తే అర్థ మవుతుంది. కీర్తి, కాంత, కనకం మనిషికి దేవుడిచ్చే వరాలు. అతనికున్న ఆ మూడూ ఒక్కసారిగా ఊడ్చుకుపోవడం చూస్తుంటే... విధి వికటిస్తే ఇంత ప్రమాదంగా ఉంటుందా అనిపిస్తుంది. .  

ప్రస్తుతం దిలీప్ కేరళ లోని ఆలువా జైల్లో ఉన్నాడు. తాను ఎంత ప్రయత్నించినా బెయిల్ దొరకని పరిస్థితి. గత ఫిబ్రవరిలో ఓ దక్షిణాది నటిపై అత్యాచారం చేయించాడనే అభియోగం రావడంతో దిలీప్ ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే... తీగ లాగితే... డొంక  మొత్తం కదిలినట్టు... దిలీప్ పై ఇప్పుడు అభియోగాల వెల్లువే మొదలైంది. మలయాళ నటుడు కళాభవన్ మణి మరణానికి కూడా దిలీపే కారణం అని కళాభవన్ మణి సోదరుడు మంజు వారియర్ కొత్త అభియోగాన్ని లేవనెత్తాడు. దీంతో ఈ దిశగా కూడా పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మీద పడుతుంటే... జైల్లో దిలీప్ 
ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు సమాచారం. 

ఇటీవలే అతడ్ని పూర్తిగా బహిష్కరిస్తున్నట్టు మలయాళ చిత్ర పరిశ్రమ  ప్రకటించేసింది. అంటే.. ఇక దిలీప్ మలయాళ సినిమాల్లో కనిపించే అవకాశం లేనట్టే. కెరీర్ పరంగా ఇది దిలీప్ కి తేరుకోలేని దెబ్బ. చివరకు కట్టుకున్న భార్య కావ్య మాధవన్ కూడా ఇక అతనితో 
జీవితాన్ని పంచుకోలేనని తేల్చేసింది. దాంతో వైవాహిక జీవితం కూడా మట్టిగొట్టుకు పోయినట్టే. 

కేరళ.. త్రిచూర్ జిల్లాలోని చేళకుడిలో దిలీప్ కి ఓ మల్టిప్లెక్స్ థియేటర్ ఉంది. దాని పేరు ‘డి-సినిమాస్’. చివరకు దాన్ని కూడా పడగొట్టడాలని చేళకుడి మున్సిపాలిటీ నిర్ణయించింది. నిజానికి దిలీప్ పై వచ్చిన అభియోగాలకు ఈ మల్టిప్లెక్స్ కు అసలు సంబంధంలేదు. 
మరెందుకు పడగొట్టడం అంటే... నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ స్థలం ఆక్రమించి ఆ మల్టీప్లెక్స్ కట్టినట్టు రుజువైంది. దిలీప్ ఆదాయ వనరుల్లో ఈ మల్టీప్లెక్స్ ది ప్రముఖ పాత్రే. దాన్ని పడగొడుతుండటంతో.. అతని ఆదాయంపై కూడా తీవ్రమైన ప్రభావం పడినట్టయ్యింది. 

బెయిల్ ఇవ్వడానికి కేరళ కోర్టు ససేమిరా అంటోంది. ఒక వేళ బెయిల్ వచ్చినా... సినిమా ఇండస్ట్రీ బహిష్కరించేసింది. ఇక సినిమాలుండవ్. ఇంటికెళ్తే భార్య ఉండదు. మల్టీప్లెక్స్ పోవడం వల్ల ఆదాయం ఉండదు. ఇంత డౌన్ ఫాలో అతను కలలో కూడా ఊహించి ఉండడేమో. 

కేరళలో మమ్ముట్టి, మోహన్ లాల్ తర్వాత దిలీప్ నే అక్కడ ఎక్కువ అభిమానించేది. విశేషమైన అభిమాన గణం ఆయన సొంతం. పోయిన పరువు, డబ్బూ ఎలాగూ రావు. కానీ... కోట్లు ఇచ్చినా కొనలేని అభిమానుల ఎనలేని అభిమానాన్ని దిలీప్ మళ్లీ పొందగలడా? అంటే దానికీ సమాధానం లేదు. ఎందుకంటే.. అభిమానులే ఆయన్ను చీదరించుకుంటున్న పరిస్థితి.

ఇప్పుడున్న ప్రతి సినిమా హీరోకి దిలీప్ జీవితం ఓ గుణపాఠం. అనుకోకుండా వచ్చిన అదృష్టానికి పొంగిపోకూడదు. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. అహంకారం, అహంభావంతో ముందుకెళ్తే... ఎవరికైనా చివరకు ఇదే గతి. ఎంత ఎదిగినా అంత ఒదిగుండే తత్వంతో, మంచితనంతో ముందుకెళ్తే.. తెర మీదే కాదు, నిజంగా కూడా హీరోలు అనిపించుకుంటారు. 


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here