English | Telugu

కష్టాల సాలెగూడులో..స్పైడర్‌ని తాకిన వివాదం

on Oct 3, 2017

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంభినేషన్‌లో సినిమా అనగానే టోటల్‌ సౌతిండియా ఉత్కంఠగా ఎదురుచూసింది. ఎందుకంటే వీరిద్దరూ గతంలో ఎప్పుడూ జత కట్టలేదు. దానికి తోడు తమిళ్‌లో మహేశ్ ఎంట్రీ ఇస్తుండటంతో సినిమాపై అంచనాలు మిన్నంటాయి. కానీ విడుదలైనాకా తెలిసింది..సినిమాలో ఏం లేదని. డివైడ్ టాక్ రావడంతో పండగైనా సరే తెలుగునాట చాలా చోట్ల థియేటర్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. అయితే తమిళ్ వెర్షన్‌ మాత్రం దున్నేస్తుండటంతో దర్శకనిర్మాతలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అసలే డల్‌గా ఉన్న స్పైడర్‌కి వివాదం చుట్టుకుంది. అదేంటి "నో స్మోకింగ్ అండ్ డ్రింకింగ్" యాడ్ లేనటువంటి స్పైడర్ సినిమాలో వివాదమా..? అని బుర్రలు గొక్కుంటున్నారా..? ఈ సినిమాలో కాటికాపర్లను కింఛపరిచేలా సన్నివేశాలున్నాయని..వెంటనే వాటిని తొలగించాలంటూ తెలంగాణ కాటికాపర్ల సంఘం డిమాండ్ చేసింది. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని వారు చిత్ర యూనిట్‌ను హెచ్చరించారు. మరి దీనిపై స్పైడర్ నిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here