బాహుబలితో కొట్టాడు కాని..మహేశ్‌ని కొట్టలేకపోయాడు
on Jun 27, 2017
తెలుగునాట పెళ్లికాని అమ్మాయిలను మీకు కాబోయే భర్తలు ఎలా ఉండాలి అని అడిగితే..వినిపించేవి రెండే పేర్లు..మహేశ్, ప్రభాస్. అయితే మహేశ్ క్రేజ్ శిఖర సమానం..తెలుగు రాష్ట్రాలతో పాటు అలిండియా వైడ్‌గా ప్రిన్స్ అంటే తెలియని వారు లేరు. సరిగ్గా ఇలాంటి టైంలో ప్రభాస్ బాహుబలితో రావడంతో ఓవర్‌నైట్ ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిపోయాడు. ఇప్పుడు యంగ్ రెబల్‌స్టార్ ఒక బ్రాండ్..ఎన్నో దిగ్గజ సంస్థలు అతనితో బ్రాండింగ్ చేయించుకునేందుకు పోటిపడుతున్నాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషిగా ఉన్నారు..ఇదే సమయంలో జాతీయ స్థాయిలో సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ప్రముఖ దినపత్రిక మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆఫ్ ది ఇయర్ 2016 ప్రకటించింది. ఈ లిస్ట్‌లో మహేశ్ టాప్-10లో 7వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇదే లిస్ట్‌లో ప్రభాస్ 22వ స్థానానికి పరిమితమయ్యాడు. గతేడాదిలో బ్రహ్మోత్సవం లాంటి భారీ ఫ్లాప్ వచ్చినప్పటికీ మహేశ్‌కు ఈ ర్యాంక్ రావడం అతని స్టామినా ఏంటో చూపిస్తోంది. ఇక ఈ లిస్ట్‌లో రోహిత్ ఖండేల్వాల్ మొదటి స్థానంలో ఉండగా విరాట్ కోహ్లి 2, హృతిక్ రోషన్ 3, రన్వీర్ సింగ్ 4, ఫవాద్ ఖాన్ 5, సిద్ధార్ద్ మల్హోత్రా 6 మహేశ్ కంటే ముందున్నారు.