శ్రీకాంత్ అడ్డాల గురించి మహేష్ అలా అన్నాడా..?
on May 27, 2016
బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ అభిమానులతో పాటు సినీ జనాలు కూడా శ్రీకాంత్ అడ్డాలనే తప్పుపట్టారు. మహేష్ లాంటి స్టార్ చేతిలో ఉండి, భారీ బడ్జెట్ సినిమాను సరిగ్గా తీయలేకపోయాడంటూ అందరూ శ్రీకాంత్ ను టార్గెట్ చేశారు. అయితే మహేష్ మాత్రం దీనికి శ్రీకాంత్ ఎంతమాత్రం కారణం కాదంటూ సన్నిహితుల దగ్గర చెబుతున్నాడట. నేను నటించిన సినిమాలు హిట్టైతే అది టీమ్ అందరి ఘనత. ఫ్లాప్ అయితే మాత్రం, ఆ కథను ఎంచుకున్నందుకు నా తప్పు అవుతుంది. అంతేకానీ శ్రీకాంత్ ను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అని అంటున్నాడట. అంతేకాదు, ఫ్యాన్స్ కూడా సమన్వయం పాటించాలని కోరాడట మహేష్. తొలిరోజు నుంచే డివైడ్ టాక్ వచ్చిన కారణంగా బ్రహ్మోత్సవం బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. అయితే మళ్లీ పివిపి నిర్మాణంలో మరో సినిమా మహేష్ చేస్తాడని వార్తలు రావడం విశేషం.
Also Read