`లవ్ స్టోరి`.. స్టోరీలైన్ అదేనా?
on Apr 5, 2021
భావోద్వేగాలకు, అనుభూతులకు పెద్దపీట వేసే దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. `ఆనంద్`, `గోదావరి`, `హ్యాపీ డేస్`, `లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్`, `ఫిదా` చిత్రాలను పరిశీలిస్తే.. ఈ విషయం స్పష్టమవుతుంది. ఇక రాబోయే చిత్రం `లవ్ స్టోరి` కూడా ఇదే తరహా సినిమానే. పాటలు, ప్రచార చిత్రాలతో ఆ విషయంపై క్లారిటీ వచ్చేసింది కూడా.
కాగా.. ఏప్రిల్ 16న థియేటర్స్ లోకి రాబోతున్న `లవ్ స్టోరి` చిత్రానికి సంబంధించి స్టోరీ లైన్ పై ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. రేవంత్ (నాగచైతన్య), మౌనిక (సాయిపల్లవి) ప్రేమించుకుంటారు. అయితే, ఉద్యోగం లేక డీలాగా ఉంటూ.. ఆవారాగా తిరిగే రేవంత్ ని.. ఉద్యోగస్థురాలైన మౌనిక ఎలా మార్చుకుందన్నదే? `లవ్ స్టోరి` లైన్ అట.
వినడానికి సింపుల్ పాయింటే అయినా.. ఎమోషన్స్ కి బాగా స్కోప్ ఉన్న ఈ సినిమాలో నాగచైతన్య, సాయిపల్లవి మధ్య సాగే సన్నివేశాలు ప్రధాన బలంగా నిలుస్తాయని బజ్. మరి.. విడుదలకు ముందే `సారంగ దరియా`తో సెన్సేషన్ క్రియేట్ చేసిన శేఖర్ కమ్ముల అండ్ టీమ్.. సినిమాతోనూ అదే పరంపరని కొనసాగిస్తారేమో చూడాలి.