ప్రశాంత్ నీల్.. ఈ సారి తొమ్మిది నెలలే!
on Mar 4, 2021
రాశి కంటే వాసికే ప్రాధాన్యమిచ్చే దర్శకుల్లో శాండిల్ వుడ్ కెప్టెన్ ప్రశాంత్ నీల్ ఒకరు. అప్పుడెప్పుడో 2014లో `ఉగ్రం` చిత్రాన్ని తన ఫస్ట్ వెంచర్ గా తెరకెక్కించిన ప్రశాంత్.. ఆపై నాలుగున్నరేళ్ళకు పైగా గ్యాప్ తో 2018లో `కేజీఎఫ్ ఛాప్టర్ 1`తో పలకరించారు. భారీ విరామంతో వచ్చినప్పటికీ.. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ సెన్సేషన్స్ గా నిలిచాయి.
అయితే .. `కేజీఎఫ్ ఛాప్టర్ 1` తరువాత వస్తున్న `కేజీఎఫ్ ఛాప్టర్ 2` విషయంలో ఆ గ్యాప్ కొంచెం తగ్గించుకుని.. రెండున్నరేళ్ళ విరామం అనంతరం సందడి చేయనున్నారాయన. ఒకవిధంగా చూస్తే.. ప్రశాంత్ నీల్ రూపకల్పనలో వేగం పెరిగినట్టే. కట్ చేస్తే.. నెక్స్ట్ వెంచర్ విషయంలో మరింత స్పీడ్ చూపిస్తున్నారు ప్రశాంత్.
ఆ వివరాల్లోకి వెళితే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ `సలార్` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని 2022 ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. అంటే.. `కేజీఎఫ్ ఛాప్టర్ 2`కి `సలార్`కి మధ్య కేవలం తొమ్మిది నెలల గ్యాప్ మాత్రమే ఉందన్నమాట. మొత్తమ్మీద.. ప్రశాంత్ తీతలో ఇది అనూహ్య వేగమనే చెప్పాలి. మరి.. ఫాస్టెస్ట్ పిక్చరైజైషన్ తోనూ ప్రశాంత్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారేమో చూడాలి.
Also Read