ఎన్టీఆర్ ఫ్యామిలీ కొట్టిందీ... తిట్టిందీ అంతా కరెక్టే!
on Feb 18, 2019
ప్రచార చిత్రాలతో సంచనాలు సృష్టించడం, ప్రేక్షక ప్రజలు మాట్లాడుకునేలా చేయడం దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అలవాటే. ఆయన దర్శకత్వం (మరో దర్శకుడితో కలిసి) వహించిన సినిమా 'లక్ష్మిస్ ఎన్టీఆర్' త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఈ సినిమా ట్రైలర్ హాట్ టాపిక్. అందులో లక్ష్మి పార్వతిని ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబెర్ (కుమార్తె?) తిడుతూ... కొడుతున్న సన్నివేశం గురించి ఇంటర్నెట్లోనూ, సోషల్ మీడియాలోనూ పెద్ద డిస్కషన్ జరిగింది. వర్మ చూపించింది నిజమా? అబద్ధమా? అని. తాజా ఇంటర్వ్యూలో లక్ష్మి పార్వతి మాట్లాడుతూ "లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ లో నన్ను తిడుతూ కొట్టిన సన్నివేశం కరెక్టే. అది చాలా చిన్న తిట్టు. మాటల్లో చెప్పలేని అసభ్య పదజాలాన్ని ఉపయోగించి నన్ను తిట్టారు" అని అన్నారు. వర్మతో ఎన్టీఆర్ జీవితం మొత్తం చెప్పడానికి కుదరలేదని ఆమె అన్నారు. ఆమె రాసిన ఎన్టీఆర్ బయోగ్రఫీ పుస్తకాలు రెండూ ఇచ్చారట. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులను కలిసిన వర్మ సొంతంగా అధ్యయనం చేసి సినిమా తీశారని లక్ష్మి పార్వతి అన్నారు.