లక్ష్మీ మంచుకు ఆ సూపర్‌స్టార్ అంటే పిచ్చి ప్రేమ!
on Nov 29, 2020
దాదాపు అందరికీ తమ జీవితాల్లో ఎవరో ఒకరి మీద పిచ్చి ప్రేమ ఉంటుంది. సెలబ్రిటీలు అందుకు మినహాయింపు కాదు. లక్ష్మీ మంచు కొంత కాలంగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఆమెలో నటి, నిర్మాత, టెలివిజన్ హోస్ట్, వ్యాపారవేత్త.. ఇలా అనేక పార్శ్వాలున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన ఓ రహస్యాన్ని వెల్లడించారు లక్ష్మి. తనకు ఎవరంటే క్రష్ అనే విషయం చెప్పారు. ఆయన ఓ స్టార్ హీరో. ఆ హీరో పెళ్లి చేసుకున్నప్పుడు తను ఏడ్చేసిందంట.
ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరనుకున్నారు.. ఆయన టాలీవుడ్ స్టారో, ఏ సౌతిండియన్ స్టారో కాదు.. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్! అవును. ఆయనంటే తనకు పిచ్చి ప్రేమ అనీ, ఆమిర్ రెండో పెళ్లి చేసుకున్నప్పుడు కూడా తను ఏడ్చాననీ ఆమె చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఆమిర్‌పై క్రష్‌ను అలా గుండెల్లోనే దాచుకొని, ఆమె ఎన్నారై ఆండీ శ్రీనివాసన్‌ను 2006లో పెళ్లాడారు. వారికి విద్యా నిర్వాణ అనే కుమార్తె ఉంది. సరోగసీ ద్వారా నిర్వాణను లక్ష్మి కన్నారు.
Also Read