ఆ హీరోకి దీపికా పదుకునే లాంటి భార్య కావాలట!
on Jun 5, 2020
దీపికా పదుకొనే లాంటి అమ్మాయి తన జీవితభాగస్వామిగా రావాలని కోరుకుంటున్నానని బాలీవుడ్ యువ హీరో కార్తిక్ ఆర్యన్ అంటున్నాడు. గత ఏడాది 'లుకా చుప్పీ', 'పతీ పత్నీ ఔర్ వో' చిత్రాలతో పెద్ద విజయాల్ని అందుకున్నాడీ హీరో. ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 సెలిబ్రిటీస్లో ఒకరిగా నిలిచారు.
ప్రస్తుతం 'బూల్ బులయ్యా-2స, 'దోస్తానా' సీక్వెల్స్‌తో బిజీగా ఉన్న కార్తీక్ ఆర్యన్... ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'మీకు కాబోయే అమ్మాయి ఎలా ఉండాలి?' అని అడిగిన ప్రశ్నకు "దీపికా పదుకొనే లాంటి అమ్మాయి కోసం ఎదురుచూస్తున్నాను" అని బదులిచ్చాడు. అలాంటి లక్షణాలున్న అమ్మాయి ఇంకా తారసపడలేదని అతడు చెప్పుకొచ్చాడు.
దీపికా పదుకొనే, కార్తీక్ ఆర్యన్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. కార్తిక్ ఆర్యన్ నటించిన 'పతీ పత్నీ ఔర్ వో' చిత్రంలోని "ధీమే ధీమే" పాటకు దీపికా సరదాగా డ్యాన్స్ చేసింది. దీపికా డ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడొస్తుందా? అని బాలీవుడ్ ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read