కత్తి మళ్లీ కెలుకుతున్నాడు!
on Jan 23, 2018
మొన్నటి దాకా జరిగిన గొడవ చాలదన్నట్టు... మళ్లీ మెగా అభిమానుల్ని కెలుకుతున్నాడు కత్తి మహేశ్. రీసెంట్ గా... సాయిధరమ్, వినాయక్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘ఇంటలిజెంట్’ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ లో గాయపడ్డ చేతితోనే గన్ పట్టుకొని ఉంటాడు సాయిధరమ్. దాన్నే టార్గెట్ చేశాడు కత్తి మహేశ్.
‘సినిమా పేరు ‘ఇంటిలిజెంట్‘ అని పెట్టారు. తెలివైవాడు గాయపడ్డ చేతితో గన్ పట్టుకోవడం ఏంటో. టైటిల్ కి తగ్గట్టు అయితే... ఫస్ట్ లుక్ లేదు’ అని ట్వీట్టర్ లో కామెంట్ పెట్టాడు.
హీరో ఏ సందర్భంలో అలా గాయపడ్డ చేత్తో గన్ పట్టుకున్నాడో సినిమా చూస్తే కానీ... అర్థం కాదు. కానీ.. ఒక ఫిలిం క్రిట్ అయ్యుండి.. ఆ మాత్రం అవగాహన లేకుండా ట్విట్టర్లో కామెంట్లు పెట్టడం ఏంటో అని ‘ఇంటిలిజెంట్’ సినిమా యూనిట్ సభ్యులు వాపోతున్నారు.
మరో విషయం ఏంటంటే.. ఈ సినిమాకు టైటిల్ మీద కూడా విమర్శలొస్తున్నాయ్. ‘ఇంటెలిజెంట్’ అని పెట్టాల్సింది పోయి... ‘ఇంటిలిజెంట్’ అని పెట్టడం పట్ల పలువురు సెటైర్లు వేస్తున్నారు. అయితే... ‘ఇంటెలిజెంట్’ ని ‘ఇంటిలిజెంట్’ని చేయడంలో కథకు సంబంధించిన ఏదైనా సంబంధం ఉందేమో..! అనే అనుమానం వ్యక్తం చేస్తున్నవాళ్లు కూడా లేకపోలేదు.