కట్టప్ప కామెడీ అదిరింది
on Apr 27, 2017
ఇంతకు ముందు చెప్పినట్లుగా బాహుబలి -2లో కామెడీని పండించే ప్రయత్నం చేశారు రాజమౌళి. నిజానికి బాహుబలి మొదటి భాగంలో కామెడీకి ఏమాత్రం అవకాశం లేదు. కథలో కానీ, కథనంలో కానీ అలాంటి సందర్భమే కుదరలేదు. కానీ బాహుబలి – 2లో ఈ లోటుని తీర్చే ప్రయత్నం చేశారు. అనూహ్యంగా కట్టప్పతోనే కామెడీని చేయించే ప్రయత్నం చేశారు. రాజమౌళి అద్భుతమైన డైరక్టరే అయినప్పటికీ తన సినిమాలు వేటిలోనూ కామెడీని పండించలేకపోయారు. కానీ బాహుబలి -2లో మాత్రం రాజమౌళి కామెడీ ప్రశంశలని అందుకుంటోంది.