పవన్ ఫ్యాన్స్‌తో వేగలేక "జై" అనేశాడా..?
on Nov 23, 2017
చిన్న సినిమాలు.. సినిమాలకు రివ్యూలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కత్తిమహేశ్ బిగ్‌బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయిపోయారు. ఆ తర్వాత పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌పై విమర్శలు చేసి ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయాడు. తమ అభిమాన నటుడిపై విమర్శలు చేయడంతో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. చేసిన తప్పును ఒప్పుకొని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కత్తిమహేశ్ను వారు డిమాండ్ చేశారు. వీటికి ఏమాత్రం స్పందించని కత్తి తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. కానీ అభిమానులు మాత్రం ఆయన్ను వదల్లేదు.. సోషల్ మీడియాలోనూ.. బహిరంగ వేదికల మీదా మహేశ్‌పై తమ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
అయితే రీసెంట్గా జరిగిన "మెంటల్ మది"లో మూవీ ఫంక్షన్‌కు హాజరైన కత్తిమహేశ్కు ఊహించని అనుభవం ఎదురైంది. కత్తి మాట్లాడటం మొదలు పెట్టగానే అక్కడే ఉన్న పవన్ అభిమానులు "జై పవన్".. "జై పవన్" అంటూ అరవడం మొదలుపెట్టారు.. కాస్త ఇబ్బందిగా భావించిన మహేశ్, కాసేపు ఓపిక పట్టి తప్పనిసరి పరిస్థితుల్లో "జై పవన్ కళ్యాణ్" అని అనాల్సివచ్చింది. అది చూసిన వారు ఏంటీ కత్తిలో ఈ మార్పు అని ముక్కున వేలేసుకున్నారు.. పవన్‌పై విమర్శలు చేసిన కొత్తలో బయట కనిపిస్తే నరుకుతాం.. చంపుతాం అన్నా ఏ మాత్రం వెనక్కు తగ్గని కత్తి మహేశ్ చిన్న చిన్న అరుపులకే జై పవన్ కళ్యాణ్ అనడమేమిటి అంటున్నారు సినీ జనాలు. ఈ పరిణామం కొత్త వివాదానికి ఆరంభమా లేక పాత గొడవకి ముగింపా అని ఫిలింనగర్లో జోరుగా చర్చించుకుంటున్నారు.