శ్రీరామునిపై అనుచిత రాతలు.. కత్తి మహేశ్ అరెస్ట్
on Aug 14, 2020
ఫిల్మ్ క్రిటిక్, డైరెక్టర్ కత్తి మహేశ్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన శ్రీరాముని కించపరుస్తూ ఫేస్బుక్లో కామెంట్లు పెడుతున్నారని కొంతమంది సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆయన ఫేస్బుక్లో రాముని మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినట్లు నిర్ధారించుకుని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.
మొదట వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించి, ఆ తర్వాత ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. 2018 నుంచే శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కత్తి మహేశ్‌పై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఇటీవల కూడా ఆయన ఆ తరహా కామెంట్లు పెట్టడంతో హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి.