'నారప్ప' పెద్దకొడుకు ఇతనే!
on Jul 5, 2020
విక్టరీ వెంకటేశ్ టైటిల్ రోల్ చేస్తోన్న సినిమా 'నారప్ప'. తమిళంలో ధనుష్ నటించగా సూపర్ హిట్టయిన 'అసురన్'కు ఇది రీమేక్. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో వెంకటేశ్ ఇద్దరు కొడుకుల తండ్రిగా నటిస్తుండగా, ఆయన భార్య సుందరమ్మ పాత్రను జాతీయ ఉత్తమ నటి ప్రియమణి పోషిస్తున్నారు. 'అసురన్'ను నిర్మించిన వి క్రియేషన్స్‌తో పాటు సురేశ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 'నారప్ప'ను నిర్మిస్తోంది. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా మిగతా అన్ని సినిమాల షూటింగ్‌ల తరహాలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మార్చి నుంచి నిలిచిపోయింది.
గతంలో 'నారప్ప'గా వెంకటేశ్ లుక్‌ను విడుదల చేసిన నిర్మాతలు, ఇటీవల ప్రియమణి బర్త్‌డే సందర్భంగా సుందరమ్మగా ఆమె రూపాన్ని కూడా విడుదల చేశారు. లేటెస్ట్గా నారప్ప పెద్ద కొడుకు మునికన్నా లుక్‌ను రిలీజ్ చేశారు. ఆ పాత్రను 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ కార్తీక్ రత్నం చేస్తున్నాడు. ఆదివారం అతని పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్ర బృందం అతని లుక్‌ను రిలీజ్ చేసింది. అందులో ఆరంజ్ షర్ట్, బ్లూ కలర్ ప్యాంట్ వేసుకొని సైకిల్ మీద వెళ్తున్నాడు కార్తీక్ రత్నం. సినిమాలో అతనిది కీలక పాత్ర.
పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక షూటింగ్ కొనసాగించడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.