రెండోసారి గర్భం దాల్చిన కరీనా!
on Aug 13, 2020
కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ జోడీ రెండో సారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా వారు తెలియజేశారు. "మా ఫ్యామిలీలోకి మరొకరిని ఎక్స్పెక్ట్ చేయస్తున్నామని ప్రకటించడానికి చాలా సంతోషంగా ఫీలవుతున్నాం. మాకు తమ ప్రేమను, మద్దతును ఇస్తున్న శ్రేయోభిలాషులందరికీ థాంక్స్" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదివరకు ఒక చాట్ షోలో పాల్గొన్న కరీనా తమ ఫ్యామిలీని మరింత పెంచుకోవాలని తను, సైఫ్ ప్లాన్ చేస్తున్నామని తెలిపింది. కచ్చితంగా తాము రెండో బిడ్డను కంటామని ఆమె స్పష్టం చేసింది. ఆ ఇద్దరి తొలి సంతానం తైమూర్ అలీఖాన్ పుట్టినప్పట్నుంచీ ఇంటర్నెట్ను హోరెత్తిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. నెటిజన్ల ఫేవరైట్ అయిన అతనికి సంబంధించిన ప్రతి విషయాన్నీ కరీనా-సైఫ్ జంట ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ లాక్డౌన్ పీరియడ్లో తండ్రీ కొడుకుల చేష్టల్ని కరీనా తన కెమెరాతో బంధించి సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా షేర్ చేస్తోంది.
Also Read