ENGLISH | TELUGU  

గొడవల్లో షకీలా బయోపిక్

on Jul 6, 2020

ఒకప్పుడు మలయాళంలో షకీలా నటించిన చిత్రాలు విడుదలైన సమయంలో గొడవలు జరిగాయట. థియేటర్ల దగ్గర టికెట్ల కోసం ప్రేక్షకుల మధ్య గొడవలు జరిగితే... ఆమె సినిమాలు విడుదల కాకుండా చూడాలని కొందరు హీరోలు ప్రయత్నించడంతో అక్కడి పంపిణీదారులు, నిర్మాతల మధ్య గొడవలు జరిగాయని టాక్. ఇప్పుడు షకీలా జీవిత హక్కుల విషయంలో గొడవ జరుగుతోంది. అసలు వివరాల్లోకి వెళితే...

ఇటీవల మలయాళంలో 'షకీలా' సినిమా టీజర్ విడుదలైంది. అది షకీలా బయోపిక్. సరయు టైటిల్ రోల్ చేసింది. ఒకప్పటి శృంగార చిత్రాల నాయిక షకీలా జీవిత చిత్రం కావడంతో ప్రేక్షకుల నుండి స్పందన అదిరింది. అయితే, కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ మలయాళ సినిమాపై నిప్పులు చెరుగుతున్నారు. షకీలా జీవితంపై సినిమా తీసే హక్కు లు తనదేనని ఆయన చెబుతున్నారు. హిందీలో రీచా చద్దా టైటిల్ రోల్ పోషించిన 'షకీలా' సినిమాకు ఇంద్రజిత్ లంకేష్ దర్శకుడు. ఆల్రెడీ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ సినిమా కోసం హీరోయిన్ రిచా, దర్శకుడు షకీలాతో సమావేశం అయ్యారు కూడా. 

ఒంటిపై నూలు పోగు లేకుండా బంగారంతో అందాలను కవర్ చేస్తూ 'షకీలా' బయోపిక్ ఫస్ట్ లుక్ కోసం రీచా చద్దా ఫోజులు ఇచ్చారు. 2019లో సినిమాను విడుదల చేయాలనుకున్న కుదరలేదు. ఇప్పుడు మలయాళంలో షకీలా బయోపిక్ వేరొకరి తీయడంతో ఇంద్రజిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. షకీలా బయోపిక్ రైట్స్ తనదేనని ఆయన బల్లగుద్ది మరీ చెబుతున్నారు. దాంతో గొడవ మొదలైంది. రెండు బయోపిక్స్ లో ఏది ముందు విడుదల అవుతుందో చూడాలి.

Richa Chadha in Shakeela biopic,Shakeela biopic First look, shakeela biopic, shakeela biopic Latest News, I have the rights of Shakeela biopic


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.