అభిషేక్ తో కమల్ ఓవరాక్షన్..!
on May 25, 2016
మొన్నటి వరకూ పవన్ కళ్యాణ్ మీద సెటైర్లు వేసిన కమాల్ ఆర్ ఖాన్ గుర్తున్నాడా..మనోడికి నోటి దురద చాలా ఎక్కువ. ఎప్పుడూ ఎవరొకరిని అడిగి మరీ తిట్టించికోకపోతే అసలు రోజు గడవదు. లేటెస్ట్ గా ఇతగాడి ట్వీట్లకు అభిషేక్ బచ్చన్ టార్గెట్ అయ్యాడు. బచ్చన్ తో వాగ్వాదం పెట్టుకుని మళ్లీ హెడ్ లైన్స్ లోకి చేరాడు. అభిషేక్ బచ్చన్ యాక్ట్ చేసిన హౌస్ ఫుల్ 3 త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో బచ్చన్ బిజీగా ఉన్నాడు. అయితే, అభిషేక్ ను కామెంట్ చేస్తూ, కమాల్ ఖాన్ ఒక ట్వీట్ చేశాడు. అభిషేక్ సోలో హీరోగా 2007లో వచ్చిన గురుతో మాత్రమే హిట్ కొట్టాడు. ఇప్పుడు హౌస్ ఫుల్ కూడా మళ్లీ మల్టీస్టారర్ గానే చేస్తున్నాడని, సోలో హీరోగా అభిషేక్ హిట్ కొట్టలేడని అతని ట్వీట్ లోని అసలు మీనింగ్. దీనికి స్పందించిన అభిషేక్, ఆ సినిమా నేను సోలో హీరో కాదు. నాతో పాటు ఐశ్వర్య, మాధవన్, విద్యాబాలన్ లాంటి యాక్టర్స్ ఉన్నారు అని రెస్పాన్స్ ఇచ్చాడు. దీంతో మన కమాల్ గారు సైలెంట్ అవ్వచ్చుగా. మళ్లీ ట్వీట్ చేశాడు. ఆ సమయంలో మీరు, ఐశ్వర్య మాత్రమే స్టార్స్. మిగిలిన వాళ్లందరూ యాడెడ్ అట్రాక్షన్స్ అంతే అంటూ సెటైర్ వేశాడు. దీంతో ఒళ్లు మండిన అభిషేక్ బచ్చన్, నువ్వు చెప్పే మాటలకు నేను ఒప్పుకోను. దుబాయ్ లో ఎంజాయ్ చేయ్ అంటూ ఆ సంభాషణకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. కేవలం అభిషేక్ మాత్రమే కాక, గతంలో చాలా మంది హీరోలు కూడా కమాల్ ఖాన్ ను ఒక ఆట ఆడుకున్నారు. అయినా మనోడిలో మార్పు రాదు. పబ్లిసిటీ కోసం అతను ఎంచుకున్న షార్ట్ కట్ అది.