కాజల్ మెహందీ, సంగీత్ ఫంక్షన్లు ఎప్పుడంటే?
on Oct 27, 2020
కాజల్ అగర్వాల్ పెళ్లి ముహూర్తం దగ్గరపడుతోంది. ఈ వారమే ఆమె మెడలో మూడు ముళ్లు పడనున్నాయి. శుక్రవారం అనగా అక్టోబర్ 30న కాజల్, గౌతమ్ కిచ్లు పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. మరి, మెహందీ ఫంక్షన్ ఎప్పుడు? సంగీత్ ఎక్కడ?
సాధారణంగా సెలబ్రిటీలు పెళ్లి వేడుకతో పాటు మెహందీ, సంగీత్ ఫంక్షన్లు సందడి సందడిగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. బంధుమిత్రులు అందరూ కలిసి ఆటపాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. కరోనా వల్ల అటువంటి వేడుకలు పెద్దగా చేయడానికి కుదరడం లేదు.
కాజల్ అగర్వాల్ ఫ్యామిలీ కూడా సెలబ్రేషన్లు చిన్నగానే ప్లాన్ చేసింది. పెళ్లికి ఒక్కరోజు ముందు... ఈనెల 29న కాజల్ ఇంట పసుపు కుంకుమ, మెహందీ ఫంక్షన్ జరగనుంది. పెళ్లిరోజునే సంగీత్ ప్లాన్ చేశారు. వీటికి ఎక్కువ మందిని ఆహ్వానించడం లేదు. అది కొద్ది మంది సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో వేడుకలు జరగనున్నాయి.