చెల్లి నిషాతో కాజల్ పైజమా పార్టీ!
on Oct 28, 2020
గౌతమ్ కిచ్లుతో వివాహానికి ఇంకా రెండు రోజులే టైమ్ ఉండటంతో కాజల్ అగర్వాల్ తన ప్రియమైన చెల్లెలు నిషాతో సాధ్యమైనంత సమయం గడిపేందుకు ప్రయత్నిస్తోంది. చెల్లితో కలిసి పైజమా పార్టీ చేసుకున్న ఆమె, తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ముచ్చటగా అనిపించే పిక్చర్లను షేర్ చేసుకుంది. నిషాను తన partner-in-crimeగా పేర్కొన్న కాజల్.. పైజమా పార్టీగా కనిపించే ఫొటోలను షేర్ చేసి, "మిస్ అగర్వాల్‌గా చివరి రెండు రోజులు. ప్రతి విషయంలోనూ నా పార్టనర్ అయిన నిషాతో సరదాగా గడుపుతున్నాను" అని రాసుకొచ్చింది. ఈ పైజమా పార్టీ జరిగిన మంగళవారం రోజే నిషా కొడుకు ఇషాన్ బర్త్‌డే కావడం గమనార్హం.
నిషా కొడుకును కావలించుకొన్న ఓ ఫొటోను షేర్ చేసిన కాజల్, "నా కంటిపాప, నా లిటిట్ బిగ్ బేబీ ఇషాన్ వలేచా మూడో హ్యాపియెస్ట్ బర్త్‌డే. బేషరతు ప్రేమ అంటే ఏమిటో నాకు నేర్పించినందుకు థాంక్యూ. ఆ దేవుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నీ యందు ఉండాలి నా లిటిట్ బాబుడు.. మనం ఎప్పుడూ ఇలాగే ఆడుతూ పాడుతూ ఉండాలి" అని రాసింది.
అక్టోబర్ 30న ముంబైలో గౌతమ్ కిచ్లుతో కలిసి ఏడడుగులు నడవబోతోంది కాజల్. అనంతరం ఆమె గౌతమ్ ఇంటికి కాపురానికి వెళ్లనుంది.
Also Read