కొత్త పెళ్లికూతురు కాజల్‌కు ఫ్రెండ్ బెల్లంకొండ క్యూట్ మెసేజ్!
on Oct 31, 2020
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు పెళ్లి శుక్రవారం రాత్రి ముంబైలోని కొలాబాలో ఉన్న ద తాజ్ మహల్ హోటల్లో కన్నుల పండువగా జరిగింది. రోజ్ పింక్, ఎరుపు మిశ్రమ వర్ణం లెహెంగాలో కాజల్ గార్జియస్‌గా మెరవగా, గౌతమ్ తెల్లటి షేర్వాణీ, తలకు టర్బన్ ధరించి హుందాగా కనిపించాడు. ఈ పెళ్లికి రెండు కుటుంబాలవారు, అతి కొద్దిమంది సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి ఎవరూ పెళ్లికి వెళ్లినట్లు కనిపించలేదు.
కాజల్ ఫ్రెండ్ బెల్లంకొండ శ్రీనివాస్ ఈ పెళ్లికి హాజరవనున్నాడంటూ, కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. మీడియా కూడా దీనికి కవరేజ్ ఇచ్చింది. అయితే శ్రీనివాస్ ఈ పెళ్లికి అటెండ్ కాలేదు. అందుకు బదులుగా సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా తన ఫ్రెండ్‌కు వెడ్డింగ్ విషెస్ తెలియజేశాడు. కాజల్‌కు కంగ్రాట్స్ చెప్పిన శ్రీనివాస్, "నువ్వు, జీకే (గౌతమ్ కిచ్లు) బ్రదర్ మధ్య బంధం బలంగా ఎదుగుతుందనీ, మీరు సంతోషకరమైన జ్ఞాపకాలను తయారుచేసుకుంటారనీ ఆశిస్తున్నా. మీ మార్గంలోకి Sending loads of love your way" అని ట్వీట్ చేశాడు.
బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా 'కవచం', 'సీత' సినిమాలు చేశారు. ఈ సినిమాలు చేసే టైమ్‌లో ఆ ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. ఆ ఇద్దరి బంధం గురించి వేరే రకమైన ప్రచారాలు జరిగినా, వారి స్నేహంలో మార్పు లేదని కాలం తెలియజేసింది.
Also Read