కాజల్‌కి ఇడ్లీతో స్వీట్... బావుందట!
on Nov 24, 2020
మాల్దీవుల్లో కాజల్ అగర్వాల్,గౌతమ్ కిచ్లు హనీమూన్ ముగిసింది. ఇద్దరూ ఇండియాకి తిరిగొచ్చారు. అంతే కాదు... చెన్నైలో అడుగుపెట్టారు. వాళ్లకు ఐటిసి గ్రాండ్ చోళ హోటల్ వాళ్లు టేస్టీ ఫుడ్‌తో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఫుడ్ టేస్ట్ చేశాక ఫిదా అయిన కాజల్ భర్త గౌతమ్, ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేయడంతో పాటు ఎటువంటి అంచనాలు లేకుండా వెళ్లిన తనకు సర్ప్రైజ్ లభించిందని అన్నాడు.
ఫుడ్‌లో అన్నిటికంటే హైలైట్ 'హ్యాపీ మ్యారీడ్ లైఫ్' డిజర్ట్ (స్వీట్) అని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. చీజ్ కేక్‌లో కాఫీ, పాలు, ఇడ్లి కలిపి ఇచ్చిన స్వీట్ సూపర్ ఉందనీ... తన భర్త చెప్పిన తొమ్మిది ఫుడ్ ఐటమ్స్‌లో అది లేదని కాజల్ అన్నారు. ఐటిసి గ్రాండ్ చోళతో పాటు చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో సైతం కాజల్ అగర్వాల్, గౌతమ్ ఫుడ్ టేస్ట్ చేశారు.
Also Read