హారర్ మూవీలో కాజల్ అగర్వాల్?
on Dec 1, 2020
దాదాపు పద్నాలుగేళ్ళుగా కథానాయికగా రాణిస్తోంది కాజల్ అగర్వాల్. అయితే ఇన్నేళ్ళలో ఎప్పుడూ హారర్ మూవీలో నటించింది లేదు. తొలిసారి ఆ జోనర్ లో ఓ సినిమా చేయబోతోంది మన టాలీవుడ్
చందమామ.
ఆ వివరాల్లోకి వెళితే.. తాజాగా డీకే దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట కాజల్. నలుగురు అమ్మాయిల కథగా నడిచే ఈ సినిమాలో ఒక నాయికగా నటించేందుకు ఈ టాలెంటెడ్ బ్యూటీ
ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుందని, మరో ముగ్గురు అగ్ర నాయికలతో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు కోలీవుడ్ బజ్. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.
కాగా ప్రస్తుతం కాజల్ చేతిలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్యతో పాటు లోకనాయకుడు కమల్ హాసన్ ఇండియన్ 2, దుల్కర్ సల్మాన్ హే సినిమాక వంటి తమిళ చిత్రాలున్నాయి.
మరి.. కుమారిగా ఘనవిజయాలు చూసిన కాజల్.. శ్రీమతి కాజల్ గానూ ఆ పరంపరని కొనసాగిస్తుందేమో చూడాలి.
Also Read