కరణ్ జోహార్‌కు దక్కని 'మాస్టర్' హిందీ రీమేక్ రైట్స్!
on Jan 25, 2021
విజయ్ టైటిల్ రోల్‌లో లోకేశ్ కనకరాజ్ రూపొందించిన 'మాస్టర్' మూవీ విమర్శకులకు నచ్చకపోయినా, ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. అందుకే థియేటర్లలో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీలోనూ వరల్డ్ వైడ్‌గా రూ. 200 కోట్లకు పైగా గ్రాస్‌ను సాధించి, రికార్డు సాధించింది. ఈ సినిమాలో భవానీ అనే విలన్ రోల్‌లో విజయ్ సేతుపతి ప్రదర్శించిన నటన అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇప్పటికే తమిళ, తెలుగు వెర్షన్లు లాభాలను అందుకున్న ఈ మూవీని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
సాధారణంగా సౌత్ హిట్ మూవీస్‌ను హిందీలో రీమేక్ చేయడానికి ఎప్పుడూ ముందుండే ధర్మా ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ 'మాస్టర్' రీమేక్ రైట్స్‌పైనా కన్నేశాడు. కానీ.. ఆ రైట్స్ ఆయనకు దక్కలేదు. 'కబీర్ సింగ్'తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన మురాద్ ఖేతానీ 'మాస్టర్' హిందీ రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకున్నాడు. పలువురు బాలీవుడ్ నిర్మాతలు ఈ హక్కుల కోసం పోటీపడగా, రూ. 6 కోట్లతో 'మాస్టర్' హక్కుల్ని ఖేతానీ సొంతం చేసుకున్నాడు. ఇదివరకు 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ రైట్స్‌కు ఖేతానీ రూ. 4 కోట్లు వెచ్చించాడు. కరణ్ జోహార్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' మూవీని నిర్మిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
