జెన్నిఫర్ లోపెజ్, ఆర్మీ హ్యామర్ జంటగా 'షాట్‌గన్ వెడ్డింగ్'
on Oct 27, 2020
ప్రఖ్యాత హాలీవుడ్ నిర్మాణ సంస్థ లయన్స్‌గేట్ నిర్మించ తలపెట్టిన యాక్షన్ కామెడీ 'షాట్‌గన్ వెడ్డింగ్'లో జెన్నిఫర్ లోపెజ్ (అనకొండ, మ్యారీ మి), ఆర్మీ హ్యామర్ (డెత్ ఆన్ ద నీల్, రెబెక్కా) ప్రధాన పాత్రలను పోషించనున్నారు. జాసన్ మూర్ (పిచ్ పర్ఫెక్ట్) డైరెక్ట్ చేయనున్న ఈ మూవీకి మార్క్ హ్యామర్ (టూ నైట్ స్టాండ్), లిజ్ మెరివెథర్ (సింగిల్ పేరెంట్స్, బ్లెస్ దిస్ మెస్) రచన చేస్తున్నారు.
ఈ సినిమా డార్సీ (లోపెజ్), టామ్ (హ్యామర్) అనే జంట చుట్టూ నడుస్తుంది. వారి అల్టిమేట్ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఇరువురి ఫ్యామిలీలు ఏర్పాట్లు చేసి, ఇక వేడుక మొదలవుతుందనే టైమ్‌లో హఠాత్తుగా అక్కడ హాజరైన అందరి ప్రాణాలు డేంజర్లో పడతాయి. వారంతా బందీలుగా మారతారు. తమ వారిని తప్పక కాపాడుకోవాల్సిన స్థితిలో డార్సీ, టామ్ ఏం చేశారు? వారే ఒకరినొకరు చంపుకోవాల్సిన వస్తే ఏం చేశారు?.. అనేది కథాంశం.
జెన్నిఫర్, హ్యామర్ స్క్రీన్ ప్రెజెన్స్, వారి మధ్య కెమిస్ట్రీ ఈ యాక్షన్ కామెడీకి ప్రధాన ఆకర్షణ అవుతాయని లయన్స్‌గేట్ ప్రతినిధి ఎరిన్ వెస్టర్మ్యాన్ తెలిపారు. ఆ ఇద్దరిపై నుంచి మన కళ్లను పక్కకు తిప్పుకోలేని విధంగా వారి పాత్రలు, వారి కెమిస్ట్రీ ఉంటుందని ఆయనన్నారు. లయన్స్గేట్తో పాటు మాండవిల్లే సంయుక్తంగా నిర్మించే 'షాట్‌గన్ వెడ్డింగ్' షూటింగ్ వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభం కానున్నది.
Also Read