పవన్‌తో జానీ మాస్టర్?
on Dec 3, 2020
రి-ఎంట్రీలో వరుస చిత్రాలతో సందడి చేయనున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్, అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్, క్రిష్ డైరెక్టోరియల్, హరీష్ శంకర్ కాంబినేషన్ మూవీ, సురేందర్ రెడ్డి డైరెక్టోరియల్.. ఇలా పంచచిత్ర ప్రణాళిక రచించారు పవన్. అంతేకాదు.. ఈ రి-ఎంట్రీ లిస్ట్ లో మరో సినిమా కూడా చేరే అవకాశం ఉందంటున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నృత్య దర్శకుడు జానీ మాస్టర్ మెగాఫోన్ పట్టాలని చాన్నాళ్ళుగా ఎదురుచూస్తున్నారు. అది కూడా.. పవర్ స్టార్ హీరోగా. ఈ క్రమంలోనే ఇటీవల పవన్ ని సంప్రదించి ఓ ఆసక్తికరమైన స్టోరీ లైన్ చెప్పాడట జానీ. అది నచ్చడంతో సదరు కొణిదెల స్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంతేకాదు.. ఈ చిత్రాన్ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించనున్నారని బజ్. మరి.. పవన్, జానీ కాంబినేషన్ వెంచర్ వార్తలకే పరిమితమవుతుందో లేదంటే కార్యరూపం దాల్చుతుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.