నయన్ పాత్రలో జాన్వి
on Dec 1, 2020
ధడక్, గుంజన్ సక్సేనా చిత్రాలతో హిందీనాట నటిగా మంచి మార్కులు కొట్టేసింది శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. ఈ టాలెంటెడ్ బ్యూటీ నటించిన తాజా చిత్రం రూహీ ఆప్జా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉండగా.. దోస్తానా 2 సెట్స్ పై ఉంది. ఈ నేపథ్యంలోనే.. రీసెంట్ గా మరో సినిమాకి జాన్వి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆ వివరాల్లోకి వెళితే.. లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం కొలమావు కోకిల (కోకోకోకిల పేరుతో తెలుగులో అనువాదమైంది) హిందీలో రీమేక్ అవుతోంది. ఇందులో నయన్ పోషించిన పాత్రలో జాన్వి నటించబోతోంది. ఆనంద్ ఎల్. రాయ్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహించనున్నారు. జనవరి 9 నుంచి పంజాబ్ లో ప్రారంభం కానున్న ఈ సినిమాని.. సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేసుకుంటోంది.
మరి.. నయన్ పాత్రలో జాన్వి ఏ స్థాయిలో ఒదిగిపోతుందో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు వేచిచూడాల్సిందే.
Also Read