పవన్ స్పీచ్... అదిరిపోయిన డైలాగులు
on Aug 27, 2016
తిరుపతిలో పవన్ సభ.. వాడి వేడిగా సాగింది. పవన్ ఎప్పటిలా సూటిగా, సుత్తి లేకుండా మాట్లాడాడు. పవన్ స్పీచ్‌లో అదిరిపోయిన డైలాగులు ఇవీ..
* సినిమాలపై నాకు వ్యామోహం లేదు.. కానీ దేశంపై వ్యామోహం ఉంది.
* సినిమాల్లో చాలా చెప్తాం.. రెండున్నర గంటల్లో అద్భుతాలు చెప్పొచ్చు, ఆస్తులు దానం చేయొచ్చు. రౌడీల్నీ విలన్లన్నీ కొట్టేయొచ్చు. హీరోయిన్లతో పాటలు పాడొచ్చు.. అన్యాయాల్ని ఎదుర్కోవొచ్చు.. సమస్యలకు పరిష్కారం చూపించొచ్చు.. ఇదంతా రెండున్నర గంటల్లో చేయొచ్చు. రాందేవ్ బాబా టూ మినిట్స్ నూడిల్స్ లా పనులు జరగవు. చాలా త్యాగాలు చేయాలి.
* వదిలిన బాణం.. పెదవి దాటిన మాట వెనక్కి తీసుకోవడం కష్టం. అందుకే తొందర పడి మాట్లాడను.
* మాట ఇచ్చానంటే తప్పేవాడ్ని కాదు. మడం తిప్పే వాడ్ని కాదు.
* నన్ను కొంతమంది భజన సేన అంటున్నారు. కరక్టే.. నేను మీకు నేను భజన సేన. తెలుగు రాష్ట్ర్రాల ప్రజల కష్టాలకు భజన సేన.
* నేను తెలుగు దేశం తొత్తుని కాదు.. ప్రజల పక్షపాతిని. రైతుల పక్షపాతిని, అక్కచెళ్లెళ్ల పక్షపాతిని. ఏ పార్టీకో, వ్యక్తులకో నేను నా జీవితాన్ని ఇవ్వను.
* చెగువేరా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే.. తన దేశం కాదు, తన సమస్య కాదు.. కొంతమంది బాధపడుతుంటే వాళ్ల కోసం పోరాటం చేశాడు. సమస్య మనదే అవ్వక్కర్లెద్దు... మన కుటుంబందే అవ్వక్కర్లెద్దు. అయినా పోరాటం చేశారంటే.. వాళ్లే నా నిజమైన హీరోలు.
* సినిమా అనేది వినోదంగానే చూడండి. వేరే హీరోలతో గొడవల్లేవు. అందరూ నాతోనే బాగానే ఉంటారు. మీరు సీరియస్‌గా తీసుకోవొద్దు. నిజ జీవితాన్ని అందులో సమస్యల్ని సీరియస్‌గా తీసుకొంటా. దాని కోసం మీ జీవితాలు క్షణికావేశంలో పాడు చేసుకోవొద్దు.
* ఏ రూపంలో ఉన్నా భగవంతుడు ఒక్కడే. నేను హిందువు.. నా కూతురు క్రిస్టియన్. నాకు ఏ తేడా లేదు. అలాంటివాడ్ని నేను. కానీ కులం, మతం, ప్రాంతం అంటూ అంటగట్టారు.
* నేను ఏం చేసినా.. మభ్యపెట్టను. అబద్దాలు చెప్పను. చేతనైంది చేస్తా. నేను చేయలేకపోతే.. క్షమించండి అంటాను తప్ప.. మభ్యపెట్టను.
* జనసేన పుట్టింది ఎవరి జెండానో మోయడానికి కాదు.
* అడుగు ముందుకేస్తే.. మెడ తెగి పడాలే కానీ... కాలు వెనక్కి పడదు