ఇంతకంటే నీచుడు ఉండడేమో
on Jul 19, 2018
జగపతిబాబు – శోభన్‌బాబు తర్వాత, అంతటి ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్లో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. కానీ ఎప్పుడైతే అవకాశాలు తగ్గిపోయాయో... మిగతావాళ్లలాగా డీలా పడిపోలేదు. కాస్త రూటు మార్చి విలన్‌గా నిలదొక్కుకున్నాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలంలాంటి సినిమాల్లో భయంకరమైన విలన్‌గా చెరిగిపోని ముద్ర వేశాడు. ఈ సినిమాల విజయానికి కూడా సాయపడ్డాడు. ఇప్పుడు అంతకంటే ఘోరమైన విలన్‌గా కనిపించనున్నాడట జగపతిబాబు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న ‘సాక్ష్యం’ సినిమాలో తన మీద తనకే భయం వేసేంతటి పాత్రి ఇచ్చాడట దర్శకుడు శ్రీవాస్. అందులో జగపతిబాబు పాత్ర పేరు మునుస్వామి. ఆ పాత్ర చూసిన ప్రతీ వ్యక్తి ‘ఇంతకంటే నీచుడు ఉండడేమో’ అనే అభిప్రాయానికి వచ్చేస్తారట. మరి జగపతిబాబు మాటలు ఎంతవరకు నిజమో తెలియాలంటే ఈ నెల 27 దాకా వేచి చూడాల్సిందే!