ఇలియానా కూడా రెడీ అయిపోయింది..!
on May 30, 2016
సినీ పరిశ్రమలో హిట్స్ వస్తున్నప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉంటం ఈజీ. కానీ అవకాశాల కోసం ఎదురుచూస్తూ ముదురు భామల లిస్ట్ లోకి చేరిపోయే వాళ్లకు మాత్రం ఇది చాలా టఫ్ ఫేజ్. ఇక కెరీర్ ఎర్త్ అయిపోయిందనుకుంటే, వెయింటింగ్ ఆపేసి ఎవరొకర్ని తగులుకుని సెటిల్ అయిపోతారు హీరోయిన్స్. ఛాన్స్ ల కోసం ఎదురుచూడటం కంటే, చక్కగా పెళ్లి చేసేసుకుంటే లైఫ్ లో అయినా సెటిల్ అవ్వచ్చనేది వీళ్ల ఆలోచన. లేటెస్ట్ గా ప్రియమణి ఎంగేజ్ మెంట్ చేసుకుని, త్వరలోనే పెళ్లి అని షాక్ ఇచ్చింది. త్వరలోనే మిగిలిన సీనియర్ హీరోయిన్స్ కూడా ఈమెను ఫాలో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందరిలోకీ ముందున్న పేరు ఇలియానా. పోకిరి తో లైమ్ లైట్ లోకి వచ్చిన ఇలియానా కెరీర్ పెద్ద గొప్పగా ఏమీ లేదు. అరకొరా హిట్స్ తప్పితే తెలుగులో పెద్దగా ఏమీ సాధించలేదు. ఆ తర్వాత బాలీవుడ్ ట్రై చేసి అక్కడా రెండు మూడు సినిమాల తర్వాత ఖాళీ అయిపోయింది. దీంతో ఇప్పటికే తను చెట్టాపట్టాలేసుకు తిరిగేస్తున్న ఆస్ట్రేలియన్ బాయ్ ఫ్రెండ్ యాండ్రూ నీబోన్ ను త్వరలోనే పెళ్లి చేసేసుకుని ఒక ఇంటిది అయిపోవాలని ప్లాన్ వేసుకుంటోందట ఇల్లీ బేబీ. ఆమె నటించిన రుస్తుం ఇప్పుడు రిలీజ్ కు రెడీ గా ఉంది. బహుశా ఇదే ఆమెకు ఆఖరి సినిమా కావచ్చు.