'వకీల్ సాబ్' ఆన్లైన్ బుకింగ్స్.. నిమిషాల్లో ఫుల్లవుతున్న షోలు!
on Apr 7, 2021
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ చేసిన 'వకీల్ సాబ్' మూవీ ఏప్రిల్ 9న వరల్డ్ వైడ్‌గా రిలీజవుతోంది. మూడేళ్ల అనంతరం వస్తున్న పవన్ సినిమా కావడంతో దీనిపై ఫ్యాన్స్‌లో, జనరల్ ఆడియెన్స్‌లో ఉన్న క్రేజ్ అసాధారణంగా కనిపిస్తోంది. ట్రైలర్‌కు వచ్చిన స్పందన ఇందుకు నిదర్శనం. స్క్రీన్‌పై పవర్‌స్టార్ కనిపించడం ఆలస్యం ఫ్యాన్స్ వెర్రెత్తిపోతున్నారు. కోర్టులో ఆయన చెప్పిన డైలాగ్స్, మెట్రోలో ఆయన చేసిన ఫైట్ వాళ్లను కుదురుగా ఉంచనీయడం లేదు.
సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఎలాగైతే అంబరాన్ని చుంబిస్తున్నాయో, అలాగే రిలీజైన రోజే 'వకీల్ సాబ్'ను చూడాలనే ఆత్రుత ఫ్యాన్స్‌లో విపరీతంగా పెరిగిపోతోంది. అందుకు తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసిన వెంటనే షోలు ఫుల్లయిపోతున్నాయి. హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్లో ఏప్రిల్ 9న 25 షోలకు గాను ఇప్పటికే అన్ని షోలూ ఫుల్లయిపోవడం విశేషం. పలు చోట్ల ఫస్ట్ డే టికెట్ రేట్లు పెంచుతుండటంతో అక్కడ ఇంకా అడ్వాన్స్ బుకింగ్‌లు ఓపెన్ కాలేదు. ఓపెన్ అయిన చోట్లల్లా నిమిషాల వ్యవధిలోనే టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి.
హైదరాబాద్‌లో బుక్ మై షో ద్వారా జరుగుతున్న ఆన్లైన్ బుకింగ్ తీరును గమనిస్తే, ఫస్ట్ డే 'వకీల్ సాబ్' కలెక్షన్లు సునామీని సృష్టించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 'వకీల్ సాబ్'లో పవర్‌స్టార్ సినిమా మొత్తం కనిపించకపోయినా, ఆయన కనిపించేది 50 నిమిషాల సేపే అని వెల్లడి అయినా ఫ్యాన్స్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇక బాక్సాఫీస్ దగ్గర 'వకీల్ సాబ్' మానియా ఎలా ఉండనున్నదో కేవలం రెండు రోజుల్లోనే తేలిపోనున్నది.