నితిన్ సినిమాకు రాజకీయం అంటుకుందా..!
on May 26, 2016
హీరో నితిన్ ప్రొడ్యూసర్ కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంటరైనా, తనకంటూ మంచి ప్లేస్ సంపాదించుకోవడానికి, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి చాలా కష్టాలే పడ్డాడు. వరస ఫ్లాపుల్లో నుంచి ఇష్క్ సినిమాతో మళ్లీ ట్రాక్ ఎక్కి యంగ్ హీరోస్ లో దూసుకెళ్తున్నాడు. లేటెస్ట్ గా ఈ యంగ్ హీరో, సమంత, అనుపమ పరమేశ్వరన్ తో కలిసి నటించిన అ..ఆ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు రాజకీయం అంటుకుంటోందని సమాచారం. తెలంగాణా హీరోగా నితిన్ కు ఒక పేరుంది. ఇదే ఇప్పుడు అ..ఆ కు అడ్డు పడుతోందట. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రం ఇలాంటి డిఫరెన్స్ చూపించరు. రెండు ప్రాంతాల్లోనూ తమ హీరోగానే భావిస్తారు.
అయితే అ..ఆ రిలీజ్ డేట్ ను జూన్ 2 అని ప్రకటించడమే ఇప్పుడు సినిమాకు ఇబ్బందిగా మారింది. ఆ రోజు తెలంగాణా అవతరణ దినోత్సవం కాబట్టే తెలంగాణా హీరో నితిన్ ఆ రోజు రిలీజ్ చేస్తున్నాడంటూ, ఆంధ్రకు అన్యాయం జరిగిన ఆరోజున తెలంగాణా హీరో సినిమా రిలీజ్ చేయనివ్వం అంటూ కొంత మంది సమైక్యాంధ్ర వాదులు ఈ సినిమాకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో కూడా ఈ ఇష్యూపై చర్చలు జరుగుతున్నాయి. ఏదో ఎంటర్ టైన్మెంట్ కోసం తీసే సినిమాను, రాజకీయం చేసి సినిమావాళ్ల పొట్ట కొట్టడం ఎంతవరకూ కరెక్ట్ అంటూ ప్రశిస్తున్నారు సినీజనాలు. అయినా ఆడియన్స్ కు కావాల్సింది మంచి సినిమా. అది ఏ ప్రాంతం నుంచి వచ్చినా ఆదరిస్తారు. మంచి సినిమా సక్సెస్ ను, చెత్త సినిమా ఫెయిల్యూర్ ను ఎవరూ ఆపలేరు. ఏమంటారు..?