నితిన్ పెళ్లి డేట్ ఫిక్స్!?
on Jul 1, 2020
యంగ్ హీరో నితిన్ పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. జూలై 26న శాలిని కందుకూరి మెడలో మూడు ముడులు వేయడానికి, నుదుట బాసికం కట్టుకోవడానికి రెడీ అవుతున్నాడని సమాచారం. వధూవరుల కుటుంబాలు జూలై 26న ఓ మంచి ముహూర్తం ఫిక్స్ చేశాయని తెలిసింది. అయితే, నితిన్ కుటుంబ సభ్యులు పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు చేయలేదని చెబుతున్నాయట.
నిజానికి ఏప్రిల్ 16న నితిన్ ఓ ఇంటివాడు కావాల్సింది. దుబాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. కరోనా వల్ల ప్లాన్స్ అన్ని డిస్ట్రబ్ అయ్యాయి. ఇప్పుడు హైదరాబాద్ లో ఒక ఫామ్ హౌస్ లో కుటుంబ సభ్యులు అతి తక్కువ మంది స్నేహితులు, శ్రేయోభిలాషులు, సన్నిహితుల మధ్య పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆషాడ మాసం తర్వాత పెళ్లి పనులు ప్రారంభమవుతాయని తెలిసింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం నిబంధనలు పాటిస్తూ పెళ్లి చేసుకోవాలని నితిన్ నిర్ణయించుకున్నారు.