'ఆర్ఆర్ఆర్' కోసం ఆలియా హైదరాబాద్ ఎప్పుడు వస్తోందంటే...
on Oct 28, 2020
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తోన్న 'గంగూబాయి కతియావాడి' షూటింగ్‌ను ఎట్టకేలకు పునఃప్రారంభించింది ఆలియా భట్. ముంబైలోని ఒక పాపులర్ స్టూడియోలో ఆలియాపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. యస్.యస్. రాజమౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్'లో రామ్ చరణ్ జోడీగా నటించడం ద్వారా సౌతిండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోంది ఆలియా. లేటేస్ట్ రిపోర్టుల ప్రకారం 'గంగూబాయి కతియావాడి' షూటింగ్ పూర్తయిన వెంటనే, ఆర్ఆర్ఆర్ షూటింగ్లో పాల్గొనేందుకు హైదరాబాద్ రానున్నది.
వచ్చే వారమే ఆమె ముంబై నుంచి హైదరాబాద్ వస్తుందని సమాచారం. మార్చిలో కరోనా మహమ్మారి కారణంగా 'గంగూబాయి కతియావాడి' షూటింగ్ నిలిచిపోయే సమయానికి ఆలియాకు సంబంధించిన కేవలం ఒకే ఒక్క సీన్ మిగిలిపోయింది. ఇప్పుడు దాన్ని తీస్తున్నారు. "నవంబర్ ఫస్ట్ వీక్‌లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో ఓ ప్రధానమైన సన్నివేశంలో ఆలియా పాల్గొనబోతోంది" అని అంతర్గత వర్గాలు తెలిపాయి. వాస్తవానికి పూణేలోని ఓ బంగళాలో ఆ సన్నివేశాన్ని చిత్రీకరించాలని ప్లాన్ చేశారు కానీ, మహమ్మారి కారణంగా హైదరాబాద్‌కు మార్చారని సమాచారం.
కాగా 'ఆర్ఆర్ఆర్' నుంచి ఆలియాను తొలగించాల్సిందిగా రాజమౌళికి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు భారీ సంఖ్యలో సూచనలు చేస్తున్నారు. కానీ రాజమౌళి వాటిని ఏమాత్రం లక్ష్యపెట్టడం లేదు. తన పని తాను చేసుకుపోతున్నారు. ఆలియాను తీసేసి, వేరొకరిని ఆ పాత్రకు తీసుకోవాలని ఆయన ఏమాత్రం అనుకోవడం లేదు.
Also Read