చైనా యాప్ బ్యాన్.. తేజ ఆల్టర్నేటివ్ ప్లాన్!
on Jul 1, 2020
టిక్‌టాక్ సహా చైనాకు చెందిన 59 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. అందులో ‘హలో’ కూడా ఉంది. దాంతో తేజ తన కొత్త సినిమా కోసం ఆల్టర్నేటివ్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. ‘హలో’కి, తేజ కొత్త సినిమాకి లింక్ ఏంటంటే... ఎక్కువశాతం నూతన నటీనటులతో సినిమాలు తీయడానికి తేజ ఆసక్తి చూపిస్తారు. ఆడిషన్స్ ద్వారా బడ్డింగ్ యాక్టర్స్‌ని సెలక్ట్ చేస్తారు. గతంలో ఫొటోలు, షో రీళ్లు చూసి ఆడిషన్ చేసేవారు. ప్రజెంట్ టెక్నాలజీ అప్డేట్ అయింది. సోషల్ మీడియాను ఉపయోగిస్తున్న అప్‌కమింగ్ టాలెంట్ ఎంతో మంది ఉన్నారు. అందుకని, ఈసారి తీయబోయే సినిమా కోసం ‘హలో’ ద్వారా ఆడిషన్స్ చేయడం స్టార్ట్ చేశారు తేజ. ‘హలో’ యాప్‌లో పోస్ట్ చేసిన వీడియోలను ఆడిషన్స్‌కి తీసుకుంటారన్నమాట. ఇప్పుడు చైనా యాప్ బ్యాన్ చేయడంతో ఆల్టర్నేటివ్ ఆలోచిస్తున్నారట.
‘‘నేను ఓ యాప్ (హలో) ద్వారా ఆడిషన్స్ నిర్వహించాలనుకున్నాను. అది లేకపోతే మరో రకంగా చేస్తాను’’ అని తేజ స్పష్టం చేశారు. దాదాపుగా సినిమా సెలబ్రిటీలు అందరూ చైనా యాప్స్ బ్యాన్‌కి సపోర్ట్ ఇచ్చారు. దేశం కంటే ఏదీ ముఖ్యం కాదని నినదించారు. అదీ సంగతి. ప్రజెంట్ కరోనా వల్ల సినిమా ఇండస్ట్రీ పాజ్ బటన్‌లో ఉంది. మళ్లీ షూటింగ్స్ స్టార్ట్ అయ్యి, థియేటర్లు తెరిస్తే తప్ప పబ్లిసిటీ పనులు ఉండవు. టిక్‌టాక్ లేకపోతే ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పబ్లిసిటీ చేసుకోవాలని అనుకుంటున్నారు.