హరీష్ శంకర్ ది మరీ ఓవర్ కాన్ఫిడెన్సా?
on Jun 13, 2017
డీజేపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ట్రైలర్ మాసీగా కట్ చేయడం, కమర్షియల్ ఎలిమెంట్స్ కావల్సినన్ని ఉండడంతో... డీజే హిట్ కొట్టడం ఖాయం అనుకొంటున్నారంతా. అయితే... హరీష్ శంకర్ కూడా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. హరీష్‌ని చూస్తుంటే గబ్బర్ సింగ్ నాటి రోజులు గుర్తొస్తున్నాయి. అప్పుడు కూడా అంతే. ఇంతే హుషారుగా ఉండేవాడు. ట్రైలర్లో `కొడుతున్నాం సర్.. ఈసారి గట్టిగా కొడుతున్నాం` అనే డైలాగ్ కట్ చేయడం... హరీష్ కి ఈ సినిమాపై ఉన్న నమ్మకం తెలియజేస్తోంది.
అదేం.. మామూలు డైలాగ్ కాదుగా. 'ఈసారి గట్టిగా హిట్ కొట్టడం ఖాయం' అని ఇన్‌డైరెక్ట్‌గా సూచించడమే అన్నది ఫిల్మ్‌నగర్ వర్గాల ఉవాచ. మొదటి ట్రైలర్లో '23న వస్తున్నాం..' అని చెప్పడం, రెండో ట్రైలర్లో హిట్ కొడుతున్నాం.. అనే సంకేతాలు పంపేలా డైలాగ్ వదలడం.... ఇవన్నీ హరీష్ కాన్ఫిడెన్స్‌ని తెలియజేస్తున్నాయి. అయితే.. ఇప్పటికే ఇంత హైప్ ఉన్నప్పుడు లో దాన్ని కొంత తగ్గిస్తూ... సినిమాని వీలైనంత ప్రొఫైల్ లో తీసుకురావడం మంచిది కదా? అని హరీష్‌కి సన్నిహితులు సూచిస్తున్నార్ట. బన్నీ కూడా... ఆడియో ఫంక్షన్లో సినిమా గురించి పెద్దగా మాట్లాడింది లేదు. `హిట్టు కొడుతున్నాం చూడండి` అంటూ... ప్రగల్భాలేం పలకలేదు. దానికి కారణం.. హైప్ ని మరింత పెంచడం ఇష్టం లేకే. మీడియా ముందు కూడా సినిమా గురించి చాలా తక్కువ మాట్లాడమని హరీష్‌కి సూచించాడట బన్నీ.