నామినేషన్‌తో అభిజీత్‌ను ఏడిపించిన హారిక!
on Dec 1, 2020
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రోజు రోజుకూ ఆసక్తికరంగా మారుతోందనే నిజాన్ని కాదనలేం. మొదట్లో అంతంత మాత్రంగా నిర్వాహకులకే నిరుత్సాహాన్ని కలిగించిన షో.. రాను రాను హౌస్మేట్స్ మధ్య పోటీతత్వం పెరుగుతూ రావడంతో గేమ్స్‌లో ఆసక్తి పెరిగి, దానికి తగ్గట్లు రేటింగ్ కూడా పెంచుకుంటూ వస్తోంది. షో దాదాపు ముగింపు దశకు రావడంతో కంటెస్టెంట్లు తక్కువగా మిగిలారు. ఫలితంగా ఇంతదాకా మిత్రులుగా ఉన్నవాళ్లు కూడా శత్రువులుగా మారిపోతున్నారు.
చాలా క్లోజ్ ఫ్రెండ్స్‌గా కనిపించిన హారిక, అభిజీత్ సైతం అందుకు మినహాయింపు కాదు. తన వంతు వచ్చినప్పుడు అభిజీత్‌ను నామినేట్ చేస్తున్నట్లు హారిక చెప్పడంతో అతనితో సహా హౌస్మేట్స్ కూడా షాకయ్యారు. వీక్షకులదీ అదే పరిస్థితి. టాస్క్‌ను టేకప్ చేయడానికి ఒప్పుకోకపోవడమే దీనికి కారణమని హారిక చెప్పడంతో అభిజీత్ కంట నీరు తిరిగింది. అప్పుడు అభిజీత్‌ను చూసిన హారిక కూడా ఎమోషనల్ అయినట్లు కనిపించింది. ప్రతిగా హారికను అభిజీత్ నామినేట్ చేశాడు. అంటే ఆ ఇద్దరి మధ్య ఇప్పుడు స్నేహం బదులు గేమ్‌లో భాగంగా శత్రువులైపోయారన్న మాట.
అభిజీత్‌తో పాటు అవినాష్‌ను హారిక నామినేట్ చేయగా, హారితో పాటు మోనాల్‌ను నామినేట్ చేశాడు అభిజీత్. ఈ వారం నామినేషన్లో అభిజీత్, అఖిల్, అవినాష్, మోనాల్, హారిక నిలిచారు. సయ్యద్ సొహేల్, అరియానా మాత్రమే సేఫ్ అయ్యారు.