కాబోయే భర్తలో హన్సిక కోరుకునేది...
on Aug 14, 2020
గుడ్ లుక్స్...
గుడ్ లుక్స్...
గుడ్ లుక్స్... భవిష్యత్తులో తనను కట్టుకోబోయే, రాబోయే భర్త నుండి హన్సిక కోరుకునేది ఇదే. అంటే... చూపులకు అబ్బాయి బాగుండాలి. దీని అర్థం అతడు అందగాడు అయ్యి ఉండాలి. అంతకు మించి హన్సికకు ఎక్స్పెక్టేషన్స్ లేవట. సరదాకు చెప్పిందో? నిజంగా చెప్పిందో? లేటెస్ట్గా ఇన్స్టాగ్రామ్లో ప్రేక్షకుడు అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఇదే.
కరోనా తరవాత ప్రజలు అందరూ చైనా పేరు చెప్పడానికి సంకోచిస్తున్న తరుణంలో తనకు చైనీస్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని హన్సిక చెప్పుకొచ్చింది. తనకు ఇష్టమైన రంగు తెలుపు అని తెలిపింది. తన తల్లి, తండ్రి అమ్మే అని మాతృమూర్తి మోనాతో కలిసి దిగిన ఫోటో పోస్ట్ చేసింది. వేసవి అంటే ఇష్టమని, కరోనా క్వారంటైన్ త్వరగా ముగియాలని కోరుకుంటున్నట్టు హన్సిక సమాధానాలు ఇచ్చింది.
Also Read