మరోబిడ్డకు జన్మనిచ్చిన జెనీలియా..!
on Jun 1, 2016
తెలుగు వారికి సుపరిచితమైన నటి జెనీలియా. బొమ్మరిల్లు, రెడీ, ఢీ లాంటి బ్లాక్ బస్టర్స్ లో యాక్ట్ చేసిన జెన్నీ, ఆ తర్వాత బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ ముఖ్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. 2012లో వీరిద్దరికీ వివాహం జరిగింది. ఆ తర్వాత ఇద్దరికీ రియాన్ అన్న బాబు పుట్టాడు. రీసెంట్ గా జెనీలియా మరో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు రితేష్ దేశ్ ముఖ్. తన పెద్ద కొడుకు ఫోటో పెట్టి, నాకు మరో తమ్ముడు వస్తున్నాడు. నా బొమ్మలన్నీ వాడివే అంటూ ట్వీట్ చేశాడు. తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని హాస్పిటల్ వర్గాలు చెబుతున్నాయి.