ఫ్రస్ట్రేటెడ్ ఆంటీస్.. క్లాస్ పీకిన శ్రద్ధా దాస్!
on Mar 27, 2020
సామాజిక మాధ్యమాలలో 'ఫ్రస్ట్రేటెడ్ ఆంటీస్' అంటూ హీరోయిన్ శ్రద్ధా దాస్ మండిపడ్డారు. ఒక రకంగా ఆమె కొంతమందికి క్లాస్ పీకారు. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో మెజారిటీ హీరోయిన్లు ఇళ్లల్లో వర్కవుట్స్ చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. వర్కవుట్ వీడియోస్ మీద సెటైర్స్ వేసే జనాలు కూడా ఉన్నారు. ఫేమస్ బాలీవుడ్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ఫరా ఖాన్ ఒక వీడియో రిలీజ్ చేశారు. 'తినండి. తాగండి. అలా చేయండి' అంటూ సెటైర్స్ వేశారు. ఫరాను ఉద్దేశించి అన్నారో, జనరలైజ్ చేసి మాట్లాడారో కానీ శ్రద్ధా దాస్ సోషల్ మీడియా సాక్షిగా 'ఫ్రస్ట్రేటెడ్ ఆంటీస్' అంటూ విరుచుకుపడ్డారు.
"ఫ్రస్టేటెడ్ ఆంటీస్ అందరికీ... నేను మీకు హెల్ప్ చేయలేను. కానీ, ఒక్కటి చెప్పగలను. ఇంటి నుండి కుకింగ్, వర్కవుట్, వగైరా వగైరా వీడియోస్ పోస్ట్ చేస్తున్న ప్రజల మీద విరుచుకుపడడం, గోల చేయడం ఆపండి. కరోనా, లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న వార్తలను చదువుతున్నా. వాళ్ళ బాధను అర్థం చేసుకోగలను. నిజాయతీగా ఫీల్ అవుతున్నా. అదే సమయంలో నా లివింగ్ రూమ్‌లో కాస్త స్పేస్ చూసుకుని ఫిజికల్‌గా, మెంటల్‌గా ఫిట్‌గా ఉండటానికి ట్రై చేస్తున్నందుకు క్షమాపణలు చెప్పను. ఈ 21 రోజులు మీరు మీ సీట్ కదపకుండా ఉండాలనుకుంటే, వ్యక్తిగతంగా మీకు మీరు ఏమీ చేసుకోవడం లేదు. అలాగే, వీడియోస్ పోస్ట్ చేస్తున్న వాళ్లకు కూడా. అప్పుడు వాళ్ళను ఫాలో అవ్వడం మానేయండి. అంతే కానీ, వాళ్ళను హెచ్చరించాల్సిన అవసరం లేదు. నోబడీ కేర్స్" అని శ్రద్ధా దాస్ పోస్ట్ చేశారు.
రేపు అన్న రోజున ఈ ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ మీరెందుకు సంతోషంగా ఉన్నారు? మీరెందుకు బతికున్నారు? అని అడుగుతారేమోనని శ్రద్ధా దాస్ అన్నారు. "మేకప్ ఎందుకు వేసుకున్నావ్? నీకు ఇల్లు ఎందుకు ఉంది? అని కూడా అడుగుతారేమో. భాయ్... అంత జలసీ ఉంటే ఫాలో అవ్వవద్దు. ఎవరికి ఏది చేయాలని అనిపిస్తే అది చేస్తారు. పోస్ట్ చేయాలనుకుంటే చేస్తారు. షో చేయడానికి, వినయపూర్వకంగా ఉండటానికి మధ్య చిన్న గీత ఉంది. ఎవరి ఇష్టం వాళ్ళది. జడ్జ్ చేయడానికి మీరెవరు? మీరు కూడా మీ ఫ్రస్ట్రేషన్‌ను పోస్ట్ చేస్తున్నారుగా. మండుతుంది" అని శ్రద్ధా దాస్ సెలవిచ్చారు. అదీ సంగతి.