లాస్ ఏంజెల్స్‌లో ఖరీదైన ఇంటిని కొన్న ఇండియన్ యాక్ట్రెస్!
on Dec 3, 2020
'స్లమ్‌డాగ్ మిలియనీర్' సెన్సేషన్ ఫ్రీదా పింటో లాస్ ఏంజెల్స్‌లో ఖరీదైన ప్రాపర్టీని కొనుగోలు చేసింది. హాలీవుడ్‌లోని బిజీ తారల్లో ఒకరిగా మారిన ఈ ఇండియన్ యాక్ట్రెస్ ముంబై, లండన్, హాలీవుడ్ మధ్య చక్కర్లు కొడుతూ ఉంటుంది. ఇప్పుడు సెలబ్రిటీలు ఎక్కువమంది నివాసం ఉండే లాస్ ఏంజెల్స్ తూర్పు ప్రాంతంలోని లాస్ ఫెలిజ్లో ఈ ఇంటిని ఆమె కొనుగోలు చేసింది. దీనిని కొనేందుకు చాలామంది పోటీపడగా, 2.4 మిలియన్ డాలర్లు చెల్లించి, సొంతం చేసుకుంది పింటో. లిస్ట్ ప్రైస్ కంటే ఇది లక్ష డాలర్లు ఎక్కువ కావడం గమనార్హం. అయినప్పటికీ లాస్ ఫెలిజ్ మార్కెట్ ప్రస్తుతం చాలా డిమాండ్‌లో ఉంది.
టాక్స్ రికార్డుల ప్రకారం పింటో కొన్న 3,300 చదరపు అడుగుల ఇంటిని 1950 తొలినాళ్లలో కట్టారు. అయితే ఇటీవలి కాలంలో దానికి రెనొవేషన్ చేశారు. ఆ ఇంటిలో చాలా గొప్పగా డెకొరేట్ చేసిన అతి పెద్ద హాలు, లివింగ్, డైనింగ్ రూమ్‌లు, విశాలమైన కిచెన్ ఉన్నాయి. ఇంటిముందు చక్కటి గ్రాస్ యార్డ్ ఉంది. ఇంట్లో మోస్ట్ స్టైలిష్ ఏరియా ఏదంటే.. డెన్. దానిపై "హార్ట్ ఆఫ్ ద హోమ్" అనే అక్షరాలున్నాయి. అతిథుల కోసం గ్రౌండ్ ఫ్లోర్లో రెండు బెడ్ రూమ్‌లు ఉండగా, ఒకదానిలో ఫ్లోరింగ్ నుంచి సీలింగ్ దాకా బిల్టిన్ బుక్ షెల్వ్స్ ఉండటం గమనార్హం. ఈ బెడ్రూముల్లో ఒకదానికి జిమ్‌గా, మరోదానిని ఆఫీస్‌గా మార్చాలని పింటో భావిస్తోందంట. ఇంటి చుట్టూ ఏపుగా పెరిగిన బోగన్ విల్లా మొక్కలతో గార్డెన్ అందంగా కనిపిస్తోంది.
'స్లమ్‌డాగ్ మిలియనీర్' మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన పింటో, ఆ తర్వాత 'ఇమ్మోర్టల్స్', 'తృష్ణ', 'రైజ్ ఆఫ్ ద ప్లాన్ ఆఫ్ ది ఏప్స్' లాంటి సినిమాలతో మరింత ఇమేజ్ సొంతం చేసుకుంది. 36 ఏళ్ల ఫ్రీదా పింటో చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి. వాటిలో జాన్ రిడ్లీ మూవీ 'నీడిల్ ఇన్ ఎ టైమ్స్టాక్', కాన్స్టాన్స్ వూతో కలిసి నటిస్తోన్న 'మిస్టర్ మాల్కమ్స్ లిస్ట్' ఉన్నాయి.
Also Read