అప్పుడు చరణ్.. ఇప్పుడు మోక్షజ్ఞ..
on Jan 23, 2021
స్టార్ హీరోలతోనే కాదు యంగ్ హీరోల కాంబినేషన్ లోనూ జనరంజక చిత్రాలను అందించిన ఘనత డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ది. అంతేకాదు.. స్టార్ కిడ్ లను కూడా పరిచయం చేసిన వైనం ఉంది.
2007లో మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ని ఇలానే తెలుగు తెరకు చిరుతగా ఇంట్రడ్యూస్ చేశారు పూరి.
కట్ చేస్తే.. ఇప్పుడు మరో స్టార్ హీరో తనయుడిని కథానాయకుడిగా పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నారట పూరి. ఆ స్టార్ మరెవరో కాదు.. నటసింహ నందమూరి బాలకృష్ణ. చాన్నాళ్ళుగా బాలయ్య
కుమారుడు మోక్షజ్ఞ తెరంగేట్రం చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పలువురి దర్శకుల కాంబినేషన్స్ లో మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై కథనాలు వచ్చాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. మోక్షజ్ఞ
డెబ్యూ మూవీని పూరి డైరెక్ట్ చేస్తారట. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని లాంఛనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని టాక్. త్వరలోనే దీనికి సంబంధించి
అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
మరి.. చరణ్ కి శుభారంభాన్ని ఇచ్చిన పూరీ జగన్నాథ్.. మోక్షజ్ఞ విషయంలోనూ ఆ ఫీట్ ని రిపీట్ చేస్తాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
