'వాట్సాప్'కి తమిళ డైరెక్టర్ కూతురి స్క్రీన్ ప్లే
on Sep 18, 2020
తమిళ దర్శకుడు భాగ్యరాజ్ ఉన్నారు కదా! ఆయన సినిమాలు కొన్ని తెలుగులోనూ అనువాదం అయ్యాయి. కొందరు తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన తెలుసు. తమిళ చిత్ర పరిశ్రమలో భాగ్యరాజ్ ను స్క్రీన్ ప్లే కింగ్ అంటారు. ఆయన కుమార్తె శరణ్య భాగ్యరాజ్ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ స్క్రీన్ ప్లే రైటర్ అవుతున్నారు.
ఇంతకుముందు నటిగా కొన్ని యాడ్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీలు చేసిన శరణ్య... ప్రస్తుతం ఓ సినిమా కి స్క్రీన్ ప్లే రాస్తున్నారు. ఆ సినిమా టైటిల్ 'వాట్సాప్'. అది అసలు సంగతి. పొలిటికల్ సెటైర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సోషల్ మీడియాలో పోస్టులు వల్ల రాజకీయ నాయకులు ఎంత ఇబ్బంది పడతారు అనే అంశాన్ని వినోదాత్మకంగా చెబుతున్నారట. మీమ్స్, ట్రోల్స్ గురించి డిస్కస్ చేస్తారట. శరణ్య స్క్రీన్ ప్లే సినిమాకు హైలైట్ అవుతుందని డైరెక్టర్ చెబుతున్నాడు. ప్రముఖ తమిళ నటుడు యోగిబాబు ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమాలో టాలీవుడ్ కమెడియన్ అలీ చేత ఓ పాత్ర చేయించడానికి చర్చలు జరుగుతున్నాయట.
Also Read