నాగశౌర్య దర్శకుడి నిజాయతీకి హ్యాట్సాఫ్!
on Oct 29, 2020
విజయవంతమైన చిత్రాలకు చిరునామాగా ‘దిల్’ రాజును పేర్కొంటారంతా! అయితే... ఆయన సంస్థ నుండి విడుదలైన కొన్ని చిత్రాలు పరాజయం పాలయ్యాయి. అందులో రెండేళ్ల క్రితం వచ్చిన ‘లవర్’ ఒకటి. ఆ చిత్రానికి అనీష్ కృష్ణ దర్శకత్వం వహించారు. అంతకు ముందు అతడు ‘అలా ఎలా?’ అనే సినిమా తీశాడు. రాహుల్ రవీంద్రన్, ‘వెన్నెల’ కిషోర్, షానీ సాల్మన్ హీరోలుగా నటించారు. లో బడ్జెట్‌తో తీసిన ఆ సినిమా ఎటువంటి అంచనాలు లేనప్పటికీ మంచి విజయం సాధించింది. అయితే, అనీష్ కృష్ణ రెండో సినిమా డిజప్పాయింట్ చేసింది. ఫ్లాప్‌గా నిలిచింది. ఈ విషయాన్ని దర్శకుడు ఒప్పుకున్నాడు.
నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో బుధవారం కొత్త సినిమా ఒకటి పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయింది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన అనీష్ కృష్ణ... ‘‘నా ఫస్ట్ ఫిల్మ్ ‘అలా ఎలా?’తో ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేశా. సెకండ్ ఫిల్మ్‌తో డిజప్పాయింట్ చేశా. ఈసారి తప్పకుండా ఎంటర్టైన్ చేస్తా. నా స్టైల్ ఆఫ్ జానర్ ఫిల్మ్ ఇది’’ అని అన్నారు. సాధారణంగా ఫ్లాప్ సినిమాల గురించి ప్రస్తావన ఎవరూ తీసుకురారు. అందుకని, అతడి నిజాయతీకి హ్యాట్సాఫ్ చెప్పాలి. నాగశౌర్యతో తనకు కమాండ్ ఉన్న కామెడీ జానర్లో అనీష్ కృష్ణ సినిమా తీస్తున్నారట. డిసెంబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.
Also Read