డ్రగ్స్ ఆర్డర్ చేయడానికి రియా అమ్మ ఫోన్ ఉపయోగించిందా?
on Sep 15, 2020
మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె డ్రగ్స్ ఆర్డర్ చేయడానికి తన తల్లి ఫోన్ ఉపయోగించిందా? నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) వెల్లడించిన వివరాల ప్రకారం అవుననే అనుకోవాలి. డ్రగ్స్ కి సంబంధించిన వివరాలు చాట్ చేయడానికి తల్లి సంధ్య చక్రవర్తి ఫోన్ రియా చక్రవర్తి ఉపయోగించారని ఎన్సీబీ తెలిపింది.
రియా చక్రవర్తిని మొబైల్ ఫోన్లు అన్ని సబ్మిట్ చేయవలసిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోరింది. ఎన్సీపీ కంటే ముందుగా ఆమెను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. అప్పుడు మొబైల్స్ అడిగింది. అయితే తన తల్లి ఫోన్ ను రియా చక్రవర్తి ఇవ్వలేదు. ఆమె ఇంటి మీద ఎన్సీబీ రైడ్ చేసినప్పుడు రియా తల్లి సంధ్యా చక్రవర్తి ఫోన్ స్వాధీనం చేసుకొని అందులో డేటాను తిరిగి రాబట్టారు.
Also Read