ఆస్కార్‌కు కెనడా అఫిషియల్ ఎంట్రీగా ఎంపికైన ఇండియన్ డైరెక్టర్ ఫిల్మ్!
on Oct 31, 2020
ప్రఖ్యాత భారతీయ దర్శకురాలు దీపా మెహతా డైరెక్టర్ చేసిన లేటెస్ట్ ఫిల్మ్ 'ఫన్నీ బాయ్' 93వ అకాడమీ (ఆస్కార్) అవార్డ్స్‌కు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగంలో కెనడా తరపున అఫిషియల్ ఎంట్రీగా ఎంపికైంది. నామినేషన్ పొందినట్లయితే ఆ కేటగిరీలో పోటీ పడుతున్న ఆమె రెండో సినిమా అవుతుంది. ఇదివరకు మెహతా రూపొందించిన 'వాటర్' మూవీ 2007లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్ పొందింది.
పంచభూతాలపై ఆమె 'ఎర్త్', 'ఫైర్', 'వాటర్' సినిమాలను రూపొందించారు. ప్రస్తుతం ఆమె తీసిన 'ఫన్నీ బాయ్' మూవీకి రచయిత శ్యామ్ సెల్వాదురై 1994లో అదే పేరుతో ప్రచురించిన నవల ఆధారం. శ్రీలంకలో 1970ల నుంచి 1980ల కాలం నేపథ్యంతో ఈ సినిమా కథ నడుస్తుంది. చిన్న పిల్లవాడి నుంచి టీనేజర్‌గా ఎదిగే క్రమంలో అర్జీ అనే అబ్బాయి సెక్సువల్‌గా ఎదిగే క్రమాన్ని, కుటుంబం నుంచి నిరాదరణ ఎదుర్కొన్న అతడిని తోటి మగ క్లాస్మేట్ ఎలా ఆకర్షించాడనే విషయాన్ని ఈ కథలో మనలో చూస్తాం. రెండు దశల అర్జీ క్యారెక్టర్‌ను ఆరుష్ నంద్, బ్రాండన్ ఇన్‌గ్రామ్ పోషించారు.
మైనారిటీ తమిళులు, మెజారిటీ సింహళీయుల మధ్య గొడవలతో రాజకీయ ఉద్రికత్తలు తారాస్థాయికి చేరిన కాలంలో సమాజంతో, కుటుంబంతో అర్జీ ఎలాంటి అనుభవాలు పొందాడో ఈ సినిమాలో దీపా మెహతా చిత్రించారు.
Also Read