విక్రమ్ కుమార్తె పెళ్ళికి రంగం సిద్ధం!
on Jun 26, 2016
తెలుగువాడే అయినప్పటికీ తమిళంలో కథానాయకుడిగా స్థిరపడడంతోపాటు.. నటుడిగా జాతీయ ఉత్తమ అవార్డ్ గెలుచుకొన్న విక్రమ్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే.. విక్రమ్ కి పెళ్లీడుకొచ్చిన కూరుతు ఉందంటే నమ్మతరమా? మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. విక్రమ్ కుమార్తె అక్షిత త్వరలో పెళ్లిపీటలెక్కబోతోంది. కాల్విన్ సంస్థ సి.ఈ.ఓ అయిన మను రంజిత్ కు విక్రమ్ కుమార్తె అక్షితకు జూలై 10న నిశ్చితార్ధం జరగనుంది. చెన్నైలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో ఈ కార్యక్రమం జరగనుంది!