కల్యాణ్ కు జోడీగా అనుపమా?
on Dec 11, 2017
మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరోగా కల్యాణ్?... అదేంటి... అల్రెడీ మెగాఃహీరో కల్యాణ్ పరిచయం అవ్వడం అయ్యింది... స్టార్ అవ్వడం అయ్యిందీ.. ‘పవర్ స్టార్’ అనిపించుకోవడం అయ్యింది.. నంబర్ వన్ అని డిక్లయిర్ చేయడం అయ్యిందీ... రాజకీయాల్లోకి కూడా ఎంటరవ్వడం అయిపోయింది... మళ్లీ మెగా హీరోగా కల్యాణ్ పరిచయం ఏంటి? అంతా గందరగోళంగా ఉందే. అనుకుంటున్నారా?
మెగాస్టార్ చిన్నల్లుడు.. శ్రీజ భర్త పేరు కూడా కల్యాణే కదండీ. ఆ కుర్రాడు హీరోగా పరిచయం కాబోతున్నాడు. రాకేశ్ శశి దర్శకత్వంలో కొర్రపాటి సాయి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఇందులో హీరోయిన్ ఎవరో తెలుసా? అనుపమ పరమేశ్వరన్. ఆ అమ్మాయితో ప్రస్తుతం మంతనాలు కూడా జరుగుతున్నాయట. దాదాపు ఆ అమ్మాయి ‘ఓకే’ అన్నట్లు సమాచారం. కల్యాణ్ కు హీరోగా మారడానికి వైజాగ్ సత్యానంద్ దగ్గర శిక్షణ కూడా తీసుకున్నాడు. పవన్ కల్యాణ్, మహేశ్, ప్రభాస్ లకు కూడా సత్యానందే గురువు అన్న విషయం తెలిసిందే.
రేపు తెరపై కల్యాణ్ కాస్త ఫర్లేదనిపిస్తే చాలు...భుజాలపై ఎత్తుకొని మోసేయడానికి మెగా ఫ్యాన్స్ రెడీగా ఉంటారు. సో... టాలీవుడ్ కి మరో కల్యాణ్ రాబోతున్నాడటన్నమాట.
రాకేశ్ శశి,కొర్రపాటిసాయి, అనుపమా పరమేశ్వరన్ శ్రీజ భర్త కల్యాణ్